బిజినెస్

ప్రభుత్వ సాయం మరింత పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మార్చి 2: రైతుకు సహకార సంస్థల కంటే ప్రభుత్వం అధిక సాయం చేయాలని, ఇది ప్రజాస్వామ్యమని, రైతులకు కోఆపరేటివ్ కాదు, కోఆపరేషన్ జరుగుతున్నదని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ‘బహిరంగ విచారణ’ జరిగింది. 2018-19 సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ, అదనపు సర్‌చార్జిలపై ‘బహిరంగ విచారణ’ నిర్వహించారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్) ఆధ్వర్యంలో స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ అధ్యక్షత వహించగా, రెగ్యులేటరీ కమిషన్ సభ్యులు హెచ్.శ్రీనివాసులు విచారణ కొనసాగించారు. ఈ సందర్భంగా సెస్ సభ్యులు విద్యుత్ సమస్యలపై సమావేశంలో రెగ్యులేటర్ కమిషన్ చైర్మన్, సభ్యులు నిర్వహించిన విచారణ ముందు అభిప్రాయాలను, ఇబ్బందులను నివేదించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని హరిజనవాడలో హైటెన్షన్ కింద ఇళ్ళ నిర్మాణానికి గ్రామపంచాయతీ అనుమతించడంతో ఇళ్ల నిర్మాణం జరిగాయని, ప్రమాదాలు జరిగే అవకాశాలున్నందున వీటిని తొలగించాలని రెండేళ్ళుగా మొర పెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకుడు బండారి బాల్‌రెడ్డి ఆరోపించారు. అయితే హెటెన్షన్ లైన్ల కింద ఇళ్ళు నిర్మించుకోవడం తప్పని, అందులో అనుమతినిచ్చిన పంచాయతీ అధికారులది తప్పని, వారిని అడగాలని, నిలదీయండని నియంత్రణ మండలి సభ్యుడు శ్రీనివాసులు అన్నారు. అయితే దీనిపై పరిష్కారానికి అధికారులకు సూచన చేస్తామని చైర్మన్ వెల్లడించారు. సెస్‌లోభారీగా బకాయిలున్న వారి కనెక్షన్లు తొలగించడం లేదని, రూ.200 బకాయిలున్న పేదల కనెక్షన్‌లు మాత్రం వెంటనే తొలగిస్తున్నారని అన్నారు. విద్యుత్ లైన్లకు ప్రభుత్వం మంజూరు చేయడంతో వాటిని తాము నిర్మించుకున్నామని, దీని పేమెంటు లక్షా 15 వేలు ప్రభుత్వం నుండి సెస్ విడుదల అయినప్పటికీ, వాటి కోసం తాము తిరుగుతున్నా అధికారులు తమకు బిల్లులు చెల్లించడం లేదని, చైర్మన్‌కు మొరపెట్టుకుంటే బిల్లు చెల్లించాలని ఏడీకి చెప్పాడని, అయినా అమలు కావడం లేదని గొళ్ళపల్లికి చెందిన ఆలకుంట లింగయ్య ఆరోపించారు. రోడ్ల విస్తరణకు, ముంపు గ్రామాలకు సంబంధించిన పాత విద్యుత్ లైన్లు, సామగ్రి ఏమైందని వివరాలు తెలుపాలని, రూ.12 కోట్లు తొమ్మిది ముంపు గ్రామాలో డిస్మెంటల్ కోసం డబ్బు మంజూరు అయిందని, వాటి వివరాలు తెలుపాలని వల్లంపట్లకు చెందిన రాజశేఖర్ కోరగా, ఈ సమాచారం ఇవ్వడం తమ వంతు కాదని, మీరు సమాచార హక్కు కింద సెస్ నుండి తీసుకోవాలని కమిషన్ వెల్లడించింది. సెస్‌లో గత పదేళ్ళుగా సేవా భావంతో విద్యుత్ రీడింగ్, బిల్లుల కోసం కాంట్రాక్టు నిర్వహిస్తూ అనేక మంది యువకులకు ఉపాధి కల్పించామని, అయితే తమ బిల్లులు చేయడానికి సెస్‌లో ఆన్‌లైన్‌లో జేఏవో పని చేసే రవి డబ్బులు డిమాండ్ చేశాడని, దానిపై తాను ఏసీబీకి పట్టించినా, మళ్ళీ ఎనిమిది నెలలకే ఎలా ఉద్యోగం ఇచ్చారని కామర్స్ ఆఫ్ చాంబర్స్ రాష్ట్ర కార్యదర్శి యాద అంజయ్య ఆరోపించారు. దీనిపై లిఖిత పూర్వకంగా తమకు ఫిర్యాదు ఇచ్చే విచారిస్తామని కమిషన్ చైర్మన్ తెలపడంతో అంజయ్య ఫిర్యాదు ఇచ్చారు. రైతులకు, నేత పరిశ్రమలకు ఇచ్చినట్టుగానే విశ్వకర్మలు ఉపాధి పొందే కుటీర పరిశ్రమలకు కూడా విద్యుత్ రాయితీ ఇవ్వాలని పున్నమాచారి కోరారు. గొళ్ళపల్లి మాజీ సర్పంచ్ పాతూరి మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులకు అధికారులు సహకరించడం లేదని, హెల్పర్ల ద్వారా లంచాలు తీసుకుని పనులు చేస్తున్నారని, లంచం ఇస్తేనే పనులు జరుగుతున్నాయని అరోపించారు. చివరన సెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి.యూనస్ సభ్యులు లేవనెత్తిన అంశాలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ డి.లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, డైరెక్టర్లు, సెస్ అధికారులు పాల్గొన్నారు.
చిత్రం..విచారణ నిర్వహిస్తున్న రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, సభ్యుడు శ్రీనివాసులు