బిజినెస్

రియాల్టీ రంగంలో హైదరాబాద్‌కు ఉజ్వల భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: దేశం మొత్తం మీద రియాల్టీ రంగంలో హైదరాబాద్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ప్రపంచ స్థాయి పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం ఇక్కడ ఆయన, మంత్రి జూపల్లితో కలిసి కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) 6వ ఎడిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ అంతర్జాతీయ నగరానికి రియాల్టీ రంగంలో ఎనలేని ప్రాధాన్యత ఉందన్నారు. ఈ సందర్భంగా క్రెడాయ్ అధ్యక్షుడు ఎస్ రామ్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ అత్యుత్తమ నాణ్యమైన జీవన ప్రమాణాలు దేశంలో ఇతర నగరాలతో పోలిస్తే ఎక్కువన్నారు. క్రెడాయ్‌హైదరాబాద్ ప్రోపర్టీ షో ఈ నెల 4వ తేదీ వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్‌లో జరుగుతుందన్నారు. 120 మంది డెవలపర్లు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారని చెప్పారు. 15వేలకు పైగా ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. వీటిలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, అపార్టుమెంట్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, రిటైల్ కమర్షియల్ కాంప్లెక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ కలిగిన గ్రీన్ బిల్డింగ్స్‌కు ఉన్నాయి. మానవ వనరుల అభివృద్ధి సూచికలో హైదరాబాద్ అగ్రగామిగా ఉందన్నారు. ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణారావు మాట్లాడుతూ, నోట్ల రద్దు ప్రభావం నుంచి రియల్ ఎస్టేట్ రంగం కోలుకుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ సంస్కరణల వల్ల రియాల్టీ రంగం పుంజుకుందన్నారు. ఐటి, గేమింగ్, యానిమేషన్ పరిశ్రమలు విస్తరణతో మధ్యతరగతి వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ స్థిరపడేందుకు ఆసక్తిగా ఉన్నారన్నారు. క్రెడాయ్ కోశాధికారి కె రాజేశ్వర్ తమ సంస్థ లక్ష్యాలను వివరించారు.