బిజినెస్

పెట్టుబడులకు స్వర్గ్ధామం తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకించి రాజధాని హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, ఇక్కడ శాంతి భద్రతలు చక్కగా ఉన్నాయని, పెట్టుబడిదారులకు స్వర్గ్ధామమని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన హైటెక్స్‌లో క్రెడాయ్ మూడు రోజుల ప్రోపర్టీ షో ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ నగరమైన హైదరాబాద్‌లో అన్ని వౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఇక్కడ పౌరులు మంచి ఆతిథ్యమిస్తారని చెప్పారు. స్మార్ట్ పోలీసింగ్ వల్ల హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. గత నాలుగేళ్లలో క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిందన్నారు. ఇ-చాలన్, నగదు రహిత చలాన్, ఎలక్ట్రానిక్ పేమెంట్ చెల్లింపులు, కమ్యూనిటీ సిసిటివి ప్రాజెక్టు వల్ల పౌరులు సురక్షితంగా, స్వేచ్ఛగా ఉంటున్నారన్నారు. మహిళలను వేధించే వారి పట్ల షీ టీంలు గట్టి నిఘా పెట్టి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. మహిళలు హైదరాబాద్ అత్యంత భద్రమైన నగరంగా భావిస్తారని చెప్పారు. ఐటి కారిడార్‌లో లక్షలాది మంది పనిచేస్తున్నారని, నేరాల నియంత్రణకు అత్యంత ఆధునిక విధానాలు అవలంభిస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్‌మేనేజిమెంట్ మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. క్రెడాయ్ అధ్యక్షుడు ఎస్ రాం రెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల్లో ఈ ప్రదర్శనను 50 వేల మంది సందర్శించారని చెప్పారు. హెచ్‌ఎండిఏ పరిధిలో రియాల్టీ రంగం ఊపందుకుందన్నారు. క్రెడాయ్ ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణారావు క్రెడాయ్ ప్రదర్శనకు లభించిన స్పందనపై హర్షం వ్యక్తం చేశారు.