బిజినెస్

చిన్న సంస్థలపై కొనసాగుతున్న నోట్లరద్దు ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 12 : నోట్లరద్దు, జీఎస్టీ అమలుకు సంబంధించిన ఇబ్బందులనుంచి ఆర్థిక వ్యవస్థ చాలావరకు కోలుకున్నప్పటికీ, రూ.10 లక్షల లోపు రుణాలు తీసుకున్న సూక్ష్మ పరిశ్రమలు ఇంకా పూర్తిగా కోలుకోలేదని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ అండ్ సిడ్బి నివేదిక పేర్కొంది. ‘‘ రూ.10 లక్షలనుంచి రూ.10 కోట్ల వరకు రుణాలు తీసుకున్న సంస్థలు నోట్ల రద్దు కు ముందు స్థాయికి కోలుకున్నప్పటికీ, రూ.10లక్షల లోపు రుణాలు తీసుకున్న సంస్థలు మాత్రం ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు,’’ అని నివేదిక వివరించింది. అయితే వృద్ధి, జీడీపీ విస్తరణ, 7.2 శాతానికి వేగం పుంజుకున్న నేపథ్యంలో, పై రెండు సంస్కరణల వల్ల కలిగిన ఇబ్బందులు తొలగిపోయినట్టేనని విశే్లషకులు చెబుతున్న మాట నిజమే అయినప్పటికీ, రూ.50 లక్షలలోపు రుణాలు తీసుకున్న సెగ్మెంట్లు ఇంకా పూర్తిగా నోట్లరద్దుకు పూర్వస్థాయికి చేరుకోలేదు. కాగా మొత్తం ఎంఎస్‌ఎంఈలు బకాయిపడిన రుణాలు రూ.100 లక్షల కోట్లు కాగా, వీటికి అందుబాటులో ఉన్న సంఘటిత ఆర్థిక వ్యవస్థ పరిమాణం రూ.11.75 లక్షల కోట్లు మాత్రమే. దేశంలోని మొత్తం 50 మిలియన్ల ఎంఎస్‌ఎంఈల్లో కేవలం 5 మిలియన్ల సంస్థలకు మాత్రమే సంఘటిత ఆర్థిక వ్యవస్థ అందుబాటులో ఉంది. అయితే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు కారణంగా ఆర్థిక వ్యవస్థ సంఘటీకరణ బాగా పెరిగింది. 2017 రెండో అర్థ్భాగంలో మరో 4 లక్షల ఎంఎస్‌ఎంఈలు కొత్తగా రుణాలు పొందడమే ఇందుకు నిదర్శనం. ఏడాది క్రితం కేవలం 2.7 లక్షల యూనిట్లు మాత్రమే సంఘటిత రంగం నుంచి రుణాలు పొందగలిగాయి.
నివేదిక ప్రకారం, ఎంఎస్‌ఎంఈల నిరర్ధక ఆస్తులు ఒక ‘పరిమితి’లోనే ఉన్నాయి. అయితే వీటి మొత్తం పెరిగే కొద్దీ వత్తిడి అధికం కావడం తథ్యం. చిన్న తరహా సంస్థల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) పరిమాణం, పెద్ద సంస్థలతో పోలిస్తే తక్కువ.
2017, డిసెంబర్ నాటికి, రూ. కోటి కంటె తక్కువ రుణాలు తీసుకున్న చిన్నతరహా పరిశ్రమల ఎన్‌పీఏ 8.8%. అంతకుముందు సంవత్సరం 9.2%తో పోలిస్తే ఇది తక్కువ. 2017 డిసెంబర్ నాటికి, రూ.కోటి కంటే తక్కువ రుణాలు తీసుకున్న సంస్థలకు సంఘటిత ఆర్థిక వ్యవస్థ అందుబాటు 20 శాతం పెరిగింది. మొత్తం ఎంఎస్‌ఎంఈ సెగ్మెంటుకు ఈ అందుబాటు 3.2% మాత్రమే. ఇక రూ.10 లక్షల లోపు రుణాలు తీసుకున్న సంస్థలకు ఈ అందుబాటు 31 శాతం పెరగడం గమనార్హం. ప్రాధాన్యతా రంగానికి తప్పనిసరిగా రుణాలను అందించడమే కొంతమేర వృద్ధి నమోదుకు కారణమని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అధికార్లు అంగీకరించారు. ఇక రుణాలు తీసుకున్నవారిలో ప్రైవేటు రంగమే అధికం. వీరు తమ మార్కెట్ల విస్తరణకోసం రుణాలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు సంబంధించిన చాలా సంస్థలకు ఇంకా సంఘటిత ఆర్థిక వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. సిబిల్స్ ఎండి ముస్త్ఫా మాట్లాడుతూ ఇటుంటి సంస్థలను సంఘటిత ఆర్థిక వ్యవస్థకిందికి తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నదన్నారు.