బిజినెస్

విమానాలు, డ్రోన్లకూ ‘మేక్ ఇన్ ఇండియా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: ప్రభుత్వం రానున్న సంవత్సరాలలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని విమానాలు, డ్రోన్లకు కూడా వర్తింప చేయనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు బుధవారం తెలిపారు. ప్రభుత్వం ఇంకెంత మాత్రం విమానాలు, డ్రోన్లు అన్నింటికి దిగుమతులపై ఆధారపడబోదన్నారు. వచ్చే కొనే్నళ్లలో దేశానికి 1,300 విమానాల అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘ఈ 1,300 విమానాలను విదేశాల నుంచి కొనుగోలు చేయాలని మేము కోరుకోవడం లేదు. మేము వాటిని భారత్‌లోనే తయారు చేస్తాం’ అని ఆయన ఒక వార్తాసంస్థకు చెప్పారు. పౌరుల రవాణా, రక్షణ శాఖలకు అవసరమైన విమానాల తయారీ కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంబంధిత పక్షాలతో కలిసి పనిచేస్తుందని సురేశ్ ప్రభు వెల్లడించారు. డ్రోన్ల తయారీ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, అందువల్ల తమ ప్రభుత్వం వీటికి రెండో ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు. ‘డ్రోన్లకు పెద్ద మార్కెట్ ఉంది. వీటి తయారీకి భారత్‌కు ఎన్నో అవకాశాలతో పాటు సామర్థ్యం ఉంది. అందువల్ల వీటి తయారీపై కేంద్రీకరిస్తాం’ అని మంత్రి వివరించారు. విమానయాన పరిశ్రమలో కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి హై ఎండ్ టెక్నాలజీని ఉపయోగించడం అనేది తమ మంత్రిత్వ శాఖ ప్రాధాన్యత ఇస్తున్న మరో అంశమని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద విమానయాన మార్కెట్ ఉన్న దేశం చైనా అని, అయితే, ఆ దేశంతో పోలిస్తే భారత్ ప్రయాణికుల రవాణాలో ఆరోగ్యకరమైన వృద్ధిని నమోదు చేసిందని ప్రభు తెలిపారు.