బిజినెస్

దండుమల్కాపూర్‌లో పారిశ్రామిక పార్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. బుధవారం శాసనసభలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె ప్రభాకర రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ దండమల్కాపురం గ్రామంలో సర్వే నంబర్ 682, 687లోని ప్రభుత్వ భూమి కావాలని తెలంగాణ పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ కోరిందన్నారు. 343 ఎకరాల 10 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు అప్పగించారన్నారు. గ్రీన్ కేటగిరీలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఈ పార్కులో ఏర్పాటు చేస్తామని, వౌలిక సదుపాయాల పనులు ప్రారంభించామన్నారు. చట్టబద్ధమైన అనుమతులు వచ్చిన వెంటనే సివిల్‌పనులు చేపడుతామన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 18 నెలల్లో పూర్తవుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేస్తోందన్నారు. పెట్టుబడుల వెల్లువ ప్రారంభమైందని, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా ప్రభుత్వ ప్రోత్సాహముంటుందని తెలిపారు.