బిజినెస్

వేసవికి సిద్ధమవుతున్న కంపెనీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: వేసవికాలం ప్రవేశిస్తుండటంతో, కూల ర్లు, ఏసీలు, ఫ్యాన్ల తయారీదార్లు తమ వ్యాపారాలకు మరింత పదును పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా వేసవిలో వీటికి డిమాండ్ అధికంగా ఉండనున్న నేపథ్యంలో తక్కువ విద్యుత్‌ను వినియోగించుకునే వస్తువుల తయారీ, అమ్మకాలపై వ్యాపారులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ వేసవిలో సగటున ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో ఆయా కంపెనీలు తమ అమ్మకాలు 30 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి. ఎండలు ఇప్పుడే మండుతుండటంతో, తమ అమ్మకాలు వేగం పుంజుకున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది వేసవి సీజన్‌లో 1.5 నుంచి 2 డిగ్రీల వరకు అదనపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముండటం, ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగడం, ఎండతీవ్రత కూడా పెరుగుతుండటంతో, డిమాండ్ అధికంగా ఉండగలదని అంచనా వేస్తున్నట్టు ఉషా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ఫాన్స్ రోహిత్ మాధుర్ ఒక వార్తాసంస్థకు తెలిపారు. ఈ నేపథ్యంలో తాము సరికొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నట్టు కూడా వెల్లడించారు. బీఈఈ స్టార్ రేటింగ్ ప్రమాణాలను మార్చడంతో, ఐదు స్టార్ ఎసీలను, ఇన్వర్టర్‌తో సహా తయారీపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని ఒక వాణిజ్య సంస్థ మేనేజర్ తెలిపారు.
దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో ఇప్పటికే డిమాండ్ పెరగడంతో ఏసీల ఉత్పత్తులు 20-30 శాతం పెరిగాయి. ఎయిర్ కండిషనర్ల తయారీ దిగ్గజం బ్లూస్టార్ 40 కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటిల్లో 3 స్టార్, 5స్టార్ మోడళ్లున్నాయి. ఇక ఆన్‌లైన్‌లో కూడా రిఫ్రజిరేటర్లు, ఏసీల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇవి మరింత పుంజుకోవచ్చని అంచనా. గత నెలలో పానాసోనిక్ ఇండియా ఇన్వర్టర్‌తో కూడిన సరికొత్త ఏసీ నమూనాలను ప్రవేశపెట్టింది.