బిజినెస్

స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ, మార్చి 18: ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి, చెన్నై నగరాల్లో ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. మెట్రో నగరాల్లో లీటరుకు పెట్రోలు ధర 7-8 పైసలు తగ్గగా, డీజిల్ 3-4 పైసల మేర తగ్గింది. ఆదివారం ఉదయం 6 గంటలనుంచి ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.72.2, కోల్‌కతాలో 74.94, ముంబయిలో 80.07, చెన్నైలో 74.87 చొప్పున అమ్మకాలు కొనసాగాయి. ఇక డీజిల్ రేట్లు ఢిల్లీలో లీటరుకు రూ.62.71, కోల్‌కతాలో 65.4, ముంబయిలో 66.78, చెన్నైలో 66.12 చొప్పున అమ్మకాలు జరిగాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ తెలిపింది.