బిజినెస్

బ్లాక్ మండే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్:అమెరికా స్టాక్‌మార్కెట్‌లను టెక్నాలజీ షేర్ల పతనం సోమవారం కుదిపేసింది. డవ్‌జోన్స్ ఏకంగా 600 పాయింట్లు పడిపోయింది. నాస్‌డాక్ 3.3 శాతం మేర నష్టపోయింది. అమెజాన్ డాట్‌కామ్ వ్యవహారంపై దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రతికూల వ్యాఖ్యలతో రెండో త్రైమాసికం ప్రారంభంలోనే అమెరికా మార్కెట్లు కుదేలయ్యాయి. మరోపక్క చైనా అమలు చేస్తున్న ప్రతీకార సుంకాలు కూడా మార్కెట్ పతనంపై ప్రభావం చూపాయి. అమెరికానుంచి దిగుమతి చేసుకునే 128 వస్తువులపై చైనా అదనపు సుంకాలను విధించిన నేపధ్యంలో ఇరుదేశాల మద్య వాణిజ్య యుద్ధం భీకర రూపు దాల్చే ప్రమాదం ఉందన్న ఆందోళన మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. ఎస్‌ఎన్‌పీ పరిథిలోని మొత్తం 11 రంగాలు తాజా పతన ప్రభావానికి లోనయ్యాయి. గత ఎనిమిది రోజుల్లో ఎస్‌ఎన్‌పీ 500 సూచీ పతనం కావడం ఇది ఆరోసారి.