బిజినెస్

కొండెక్కిన చింతపండు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లి, ఏప్రిల్ 3: చింతపండు పేరెత్తితేనే ఎవరికైనా నోట్లో నీళ్లూరుతాయి. కాని ఈసారి చింతపండు ధరలను చూస్తే ఆందోళన కలిగిస్తోంది. నిత్యావసరం కావడంతో చింతపండు లేని ఇళ్లంటూ ఉండవు. చింతచెట్టు లేని ఊరుండదు. అయితే ఈసారి ఆశించిన స్థాయిలో చింతకాయ కాపు లేకపోవడంతో దీని రేటు పెరిగిపోతోంది. 25 శాతం వరకు మాత్ర మే చింత పంట చేతికి వచ్చినట్లు చిత్తూరు జిల్లా వ్యాపారులు చెబుతున్నారు. దీనికితోడు ఈసారి అప్పుడప్పుడు అకాల వర్షాలు కురుస్తుండటంతో చింతకాయ పుచ్చిపోయినట్లు చెబుతున్నారు. పర్యవసానంగా చింత కాపు తక్కువ.. ధర ఎక్కువగా పలుకుతోందని అంటున్నారు. గత సంవత్సరం కరిపులి రకం చింతపండు కిలో నాణ్యతనుబట్టి రూ. 80 నుంచి 90 వరకు ఉండేది.
అయితే ఈసారి రూ.150 నుంచి రూ.170 వరకు ధర పలుకుతోంది. ప్లవర్ రకం గతేడాది కిలో రూ. 60 నుంచి రూ.65 వరకు ఉండగా, ఈసారి రూ. 70 నుంచి రూ.110 వరకు ఉంది. అదే కట్టికాయ గత సంవత్సరం రూ. 40 నుంచి రూ. 45 పలుకగా, ఈసారి రూ.50 నుంచి రూ. 85 పలుకుతోంది. దుకాణాలలో మామూలు చింతపండు కిలో రూ.110 నుంచి రూ. 125 వరకు ఉంటోంది. చింతపండు అనగానే గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, కురబలకోట ప్రాం తాలు. ఈ రెండుచోట్ల సంవత్సరానికి రూ. 210 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.