బిజినెస్

దీపక్ కొచ్చర్‌కు నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3:వీడియోకాన్ బ్యాంకు రుణాల కేసుకు సంబంధించి పన్నుల ఎగవేతకు పాల్పడ్డారనే అభియోగంపై ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీచేసింది. ‘ను పవర్ రెన్యువబుల్స్’ సంస్థ ఎండీగా వ్యవహరిస్తున్న దీపక్‌కు ఐటీ యాక్ట్‌లోని 131 సెక్షన్ ప్రకారం ఈ నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు. సంస్థ ఆర్థిక వ్యవహారాలతోపాటు గడచిన ఐదేళ్లుగా అతడు దాఖలు చేసిన ఐటీ రిటర్నులు, వ్యక్తిగత ఆర్థిక వివరాలు, వ్యాపార లావాదేవీల వివరాలను నివేదించాలని ఆ నోటీసులో అధికారులు ఆదేశించారు. సంస్థ కార్యకలాపాలకు సంబంధించి విస్తృత ప్రశ్నావళిని దీపక్ కొచ్చర్‌కు పంపామని, వాటికి ఆయన సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఆ సంస్థతో సంబంధం ఉన్న మరికొందరికి నోటీసులు ఇవ్వాల్సి ఉందన్న అధికారులు వారి సమాధానాలనుబట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా వీడియోకాన్‌కు లబ్దిచేకూర్చేలా దీపక్‌కొచ్చర్‌కు భార్య చందాకొచ్చర్ సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో విచారించనున్నట్లు సీబీఐ పేర్కొంది.