బిజినెస్

ఆధార్ గుర్తింపు మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఆధార్ హోల్డర్లకు సంబంధించిన బ్యాంకు అకౌంట్లు, హెల్త్ రికార్డులు, ఆర్థి క లేదా ఆస్తుల వివరాలు తమ డేటా బేస్‌లో ఉం డవని యుఐడీఏఐ మంగళవారం స్పష్టం చేసింది. ఐడీ హోల్డర్లకు సంబంధించిన కనీస సమాచారం మాత్రమే తమ వద్ద ఉంటుందని పేర్కొంది. యు ఐడీఏఐ వద్ద ఉన్న సమాచారం దుర్వినియోగం అవుతుందంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో యుఐడీఏఐ వివరణ ఇస్తూ ‘కార్డుహోల్డర్ల బ్యాం కు ఖాతాలు, మ్యూచ్యువల్ ఫండ్స్, షేర్లు, ఆర్థిక, ఆస్తుల వివరాలు, హెల్త్ కార్డులు, కుటుంబం, కు లం, మతం, విద్య తదితర వివరాలు మా డేటాబేస్‌లో ఉండవు’ అని స్పష్టం చేసింది. బ్యాంకు ఖా తాలు, మొబైల్ నెంబర్లకు ఆధార్ నెంబరును అ నుసంధానించడం వల్ల సమాచార భద్రతకు సం బంధించిన అనేక ప్రశ్నలకు యుఐడీఏఐ సమాధానమిచ్చింది. ‘ఆధార్ కేవలం గుర్తింపుకోసం మాత్రమే. అది ప్రొఫైలింగ్ టూల్ కాదు’ అని స్ప ష్టం చేసింది. తనకు లేదా మరే ఇతర సంస్థకు ని ర్ధారణ కోసం, కార్డు హోల్డర్ల సమాచారాన్ని సేకరించడం, నియంత్రించడం, లేదా నిర్వహించడా న్ని ఆధార్ చట్టం నిషేధిస్తున్నదన్న సంగతిని గు ర్తు చేసింది. ఆధార్‌ను ప్రభుత్వ, ప్రభుత్వేతర సేవలకు బయోమెట్రిక్ గుర్తింపు విధానాన్ని అనుసరిస్తున నేపథ్యంలో, ఆధార్ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు జ రుగుతున్న తరుణంలో, యుఐడీఏఐపై వివరణ లిచ్చింది. కాగా కార్డు హోల్డర్ల సమాచార భద్రత కు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్టు యుఐడీఏఐ వెల్లడించింది.