బిజినెస్

వడ్డీరేట్లలో కోత లేనట్లేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: రిజర్వ్ బ్యాంకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించే ద్రవ్యవిధానంలో ప్ర స్తుత విధానాలనే అనుసరించే అవకావముంది. అం తర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ద్రవ్యవిధానాన్ని కొంతమేర సరళతరం చే యాలని వస్తున్న ఒత్తిళ్లను బ్యాంకు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 2018-19 ఆర్థిక సంవత్సరానికి తొలి ద్రవ్యసమీక్షను గురువారం రిజర్వ్ బ్యాంకు ప్రకటించబోతున్నది. ఆర్‌బీ ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ), ఏప్రిల్ 4,5 తేదీల్లో సమావేశం కానున్నది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందువల్ల వడ్డీ రేట్లను తగ్గించాలని రిజర్వ్ బ్యాంకుపై ఒత్తిళ్లు వస్తున్నాయి. ప్రపంచ వ్యా ప్తంగా వడ్డీరేట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ కు విధాన నిర్ణయం నల్లేరుమీద నడక కాబోదు.
గత నెలలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పావుశాతం పెంచడం ద్వారా, 2018లో మరో రెండుసార్లు వడ్డీరేట్లు పెంచుతామన్న సంకేతాలిచ్చింది. దీ నికి తోడు అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యా రల్‌కు 70 అమెరికన్ డాలర్లకు చేరుకున్న సంగతిని కూడా ఆర్బీఐ తన విధాన సమీక్ష సందర్భంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పారిశ్రామిక సం స్థ ఎఫ్‌ఐసీసీఐ తన ద్రవ్యవిధానంలో కొంతమైర సర ళ వైఖరిని ప్రకటించింది. ఇది ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటున్నదనడానికి సంకేతం. ‘కొద్ది నెలలు గా దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటున్న సంగతి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వృద్ధి వేగం పుంజుకోవాలంటే తయారీ రంగం పూర్తిస్థాయిలో కోలుకోవాలి. ఇదే సమయంలో పెట్టుబడుల ప్రవాహం కూ డా మరింత పెరగాలి’ అని ఎఫ్‌ఐసీసీఐ పేర్కొంది.
కనీస మద్దతు ధరను పెంచడం, ఉత్పత్తిలోటు క్రమంగా భర్తీ అవుతున్న తరుణంలోద్రవ్యోల్బణం 5 శాతం దిశగా పెరిగే అంశంపై ఎంపీసీ కమిటీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే ఆవకాశమున్నదని కోటక్ మహేంద్ర లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ మేనేజర్ కణాల్ షా అభిప్రాయపడ్డారు. ఒకవేళ రుతుపవనాలు సక్రమంగా ఉన్నట్లయితే ఎంసీపీ సభ్యులు కొంత వెసులుబాటు వైఖరి ప్రదర్శించవచ్చు. ద్రవ్యోల్బణం 5.5 శాతం దాటితేనే ఎంపీసీ కమిటీ కఠిన చర్యలకు ఉపక్రమించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అందువల్ల ఎంపీసీ విధాన రేట్లను అట్లాగే ఉంచి త టస్థ వైఖరినే అనుసరిస్తుందని ఆశించవచ్చన్నారు.
మార్చితో ముగిసిన త్రైమాసికంలో ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతం నమోదైంది. అంటే 5.1 శాతం అంచనా కంటే 0.50 శాతం తక్కువ. ప్రధాన ద్రవ్యోల్బణం గత డిసెంబర్‌లో 5.2 శాతానికి పెరిగి, ఫిబ్రవరి నాటికి 4.4శాతానికి తగ్గిపోయింది.
బడ్జెట్‌లో ప్రభుత్వం రైతులకు చెల్లించే కనీస మ ద్దతు ధరను 1.5 శాతం పెంచడం ద్రవ్యోల్బణం వృ ద్ధికి దారితీసే అవకాశాలున్నప్పటికీ, సెంట్రల్ బ్యాం కు తన ద్రవ్యవిధానాన్ని యథాతథంగానే కొనసాగించవచ్చునని అసోచామ్ పేర్కొంది. అందువల్ల కీ లక వడ్డీరేట్లలో ఆర్‌బీఏ ఏవిధమైన మార్పులు చేపట్టకపోవచ్చనే అసోచామ్ అంచనా వేసింది. ప్రస్తు తం రెపోరేటు 6 శాతం కాగా రివర్స్ రెపోరేటు 5.75 శాతంగా కొనసాగుతోంది. కాగా మార్జినల్ స్టాం డింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 6.25 శాతంగా ఉంది. కాగా 2018-19లో ద్రవ్యోల్బణం 4.5 శాతానికి కొద్దిగా అటూ ఇటూ ఉండవచ్చునని కోటక్ మ హీంద్రా బ్యాంకు అంచనా వేస్తోంది.