బిజినెస్

విశాఖ స్టీల్ ప్లాంట్ టర్నోవర్‌లో 31శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 3: విశాఖ స్టీల్ ప్లాంట్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లోనూ గణనీయమైన అభివృద్ధి సాధించినట్టు స్టీల్ ప్లాంట్ సీఎండీ మధుసూదన్ మంగళవారం తెలియచేశారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో ప్లాంట్ ప్రగతిని ప్లాంట్ అధికారులకు వివరించారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో ప్లాంట్ టర్నోవర్ 16,500 కోట్లకు చేరుకుని, 31 శాతం వృద్ధి సాధించిందని అన్నారు. అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్ మొట్టమొదటిసారిగా 4.5 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సాధించింద ని వెల్లడించారు. ప్లాంట్ విస్తరణ, ఆధునీకరణవలన మెరుగైన ఫలితాలు సాధించగలిగామని అన్నారు. బ్లాస్ట్ ఫర్నెస్‌ల వద్ద పల్వరైజ్డ్ కోల్డ్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా కోల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించగలిగామని అన్నారు. ఈ-ఆఫీస్ విధానం వలన ప్లాంట్ అభివృద్ధికి కావల్సిన సత్వర నిర్ణయాలు తీసుకోగలిగామని అన్నారు. లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా నార్త్ ఈస్ట్రన్ రీజియన్‌కు సముద్ర మార్గాన విశాఖ ఉక్కును సరఫరా చేయగలిగామని మధుసూదన్ చెప్పారు.

చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న మధుసూదన్