బిజినెస్

రెండోరోజూ రాణించిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా రెండోరోజు కూడా స్టాక్‌మార్కెట్లు పుంజు కున్నాయి. మంగళవారం జరిగిన లావాదేవీల్లో సా నుకూల పరిస్థితులు నెలకొనడంతో ఈక్విటీలు మరింత బలపడటంతో పాటు ఆర్‌బీఐ ఇచ్చిన తాజా ఊతంతో బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. ఇటు సెనె్సక్స్, ఇటు నిఫ్టీ కూడా లావాదేవీల చివరి దశలో బాగా రాణించాయి. సెనె్స క్స్ 115.27 పుంజుకుంది. అలాగే నిఫ్టీ కూడా 33.20 పా యింట్లు బలపడింది. బ్యాంకు షేర్లతోపాటు ఆటో, ప్రభుత్వరంగ సంస్థలు ఇంధన కంపెనీలకు చెందిన షేర్లు కూడా రాణించాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత మారక విలువ మరింత పెరగడం కూడా మార్కెట్లలో సానుకూల పరిస్థితులకు కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఒ డిదుడుకుల పరిస్థితులు కొనసాగినప్పటికీ దేశీయ మా ర్కెట్లు స్థిరంగా కొనసాగాయని నిపుణులు తెలిపారు. ము ఖ్యంగా చివరి దశలో బలాన్ని సంతరించుకుని పలు కంపెనీల షేర్లు పెరిగాయని తెలిపారు. బాండ్ల ట్రేడింగ్ నష్టాల విషయంలో ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయం బ్యాంకు షేర్లు బలపడటానికి దారితీశాయి. నేటి లావాదేవీల్లో వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ అంతిమంగా 0.35 శాతం పుంజుకుని 33,370.63 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూ డా వివిధ దశల్లో ఊగిసలాడి 33.20 పాయింట్లు పెరిగి 10,245 వద్ద ముగిసింది.
కాగా దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు దాదాపు 413.16 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అలాగే విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్ట ర్లు ఇప్పటికే 689.75 కోట్ల రూపాయల షేర్లను విక్రయించినట్లు స్టాక్‌మార్కెట్ వివరాలు తెలియజేస్తున్నాయి. కాగా, రాణించిన బ్యాంక్ షేర్లలో బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ల విలువ 3.11 శాతం, సిండికేట్ బ్యాంక్ షేర్ల విలువ 2.75 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ల విలువ 2.29 శాతం పెరిగాయి.