బిజినెస్

ఉక్కు పరిశ్రమతో ‘భద్రాద్రి’కి ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తామని తెలంగాణ పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు నియోజకవర్గల్లో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. భద్రాద్రి పట్టణ అభివృద్ధికి రూ 100 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. గోదావరి జలాలద్వారా పది లక్షల ఎకరాల బీడు భూములను సాగులోకి తెస్తామని ప్రకటించారు. రాష్ట్ర రోడ్ల భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని తెలిపారు. హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి కూడా ప్రసంగించారు.
కార్యక్రమంలో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాంనాయక్, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపెల్లి కవిత, శాసనసభ్యులు జలగం వెంకటరావు, కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, జాయింట్ కలెక్టర్ రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆందోళన
కొత్తగూడెంలో కలెక్టరేట్ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా మంత్రుల ప్రసంగాన్ని యూనివర్శిటీ కళాశాల విద్యార్థులు అడ్డుకున్నారు. యూనివర్శిటీ స్థలంలో కలెక్టరేటు నిర్మిస్తూ కళాశాల అభివృద్ధికి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. దీంతో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు.