బిజినెస్

నోకియా పోర్ట్ఫోలియోను విస్తరిస్తాం: హెచ్‌ఎండీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: భారత్ రిటైల్ మార్కెట్‌లో మరింతగా విస్తరించడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని నోకియా బ్రాండ్ ఫోన్ల డిజైనింగ్ మరియు అమ్మకాలు చేపట్టే హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ వెల్లడించింది. ప్రపంచంలో మూడు ముఖ్యమైన మార్కెట్లలో ఒకటిగా హెచ్‌ఎండి పరిగణిస్తోంది. కాగా బుధవారం కంపెనీ మూడు రకాల ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అవి వరుసగా నోకియా-6, నోకియా-7, నోకియా-8. ధరల విషయంలో ప్రాడక్ట్ పోర్ట్‌పోలియోను విస్తరించి, 10-20 శాతం రిటెల్ మార్కెట్‌లోకి ప్రవేశించాలని ప్రణాలికలు సిద్ధం చేసినట్టు వెల్లడించింది. 2012 వరకు భారత్‌లో మార్కెట్ ఆధిపత్యం నోకియాదే. కానీ మారుతున్న పరిణామాలకు అనుగుణంగా స్పందించకపోవడంతో వెనుకబడిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా డ్యూయల్ సిమ్‌లు, టచ్ స్క్రీన్ స్మార్ట్‌పోన్‌ల రంగంలో వెనుకబడిపోయింది.
గత ఏడాది నోకియా, హెచ్‌ఎండితో కలిసి తిరిగి మార్కెట్‌లోకి ప్రవేశించింది. కేవలం ఏడాది కాలంలోనే 11 డివైజ్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. 3ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 70 మిలియన్ డివైజ్‌ల అమ్మకాలు జరిపాం. ప్రపంచంలోని 80 దేశాల మార్కెట్లలోకి నేరుగా ప్రవేశించాం2 అని హెచ్‌ఎండి గ్లోబల్ ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వెల్లడించారు. 32020-21 నాటికి మేం స్మార్ట్ఫోన్ల రంగంలో అగ్రగామి మూడు సంస్థల్లో స్థానం సంపాదిస్తాం2 అన్నారు. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న మొబైల్ ఫోన్ మార్కెట్లలో భారత్ కూడా ఒకటి. ఐడిసీ పరిశోధన ప్రకారం 2017లో 288 మిలియన్ సెల్‌ఫోన్లు భారత్ మార్కెట్లోకి ప్రవేశించాయి. అంటే దేశంలో వార్షికంగా మొబైల్ ఫోన్ మార్కెట్ 16 శాతం చొప్పున పెరుగుతూ వస్తోంది. 2017లో స్మార్ట్ ఫోన్ల మార్కెట్ 14 శాతం. స్మార్ట్ఫోన్ కేటగిరీలో 24.7 శాతం మార్కెట్ సాంసంగ్‌దే. ఇక ఫీచర్‌ఫోన్ల విషయంలో 20.5 శాతం ఆక్రమించింది. 20.9 శాతంతో గ్జివోమీ, వివో 9.4శాతం, లినోవో 7.8 శాతం, ఒప్పొ 7.5 శాతం మార్కెట్‌ను కలిగివున్నాయి.