బిజినెస్

భారీగా తగ్గిన టెలిఫోన్ కాల్ రేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: 2016 జూన్ నుంచి 2017 డిసెంబర్ వరకు సగటున ఫోన్‌కాల్, డేటా టారిఫ్‌లు చాలావరకు తగ్గిపోయాయని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా బుధవారం పార్లమెంట్‌కు వెల్లడించారు. ఫోన్‌కాల్ టారిఫ్ 60 శాతం పడిపోయి, నిముషానికి 19 పైసలకు చేరుకున్నదని, అదేవిధంగా డేటా టారిఫ్ 90 శాతం తగ్గి 1 జీబీకి రూ.19లకు తగ్గిపోయిందని ఆయన వివరించారు. 3మొబైల్ టెలిఫోన్ సర్వీసులు తక్కువగానే ఉన్నప్పటికీ, నేషనల్ రోమింగ్, రూరల్ ఫిక్స్‌డ్ లైన్ల చార్జీలు మాత్రం ఇంకా అధికంగానే ఉన్నాయని2 ఆయన సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. మంత్రి వెల్లడించిన సమాచారం మేరకు, 2016 జూన్‌లో నిముషానికి ఔట్‌గోయింగ్ టెలిఫోన్ కాల్ టారిఫ్ 49 పైసలు ఉండగా, 2017 డిసెంబరు నాటికి 19 పైసలకు తగ్గిపోయింది. 2016 జూన్‌లో సగటు డేటా గిగాబైట్ (జీబీ)కి రూ.205గా ఉండగా, 2017, డిసెంబర్ నాటికి రూ.19లకు తగ్గిపోయింది. కాగా దేశంలో మొబైల్ కనెక్షన్లు 2017,మార్చిలో 117 కోట్లు కాగా, 2018, జనవరి నాటికి అవి 115.2 కోట్లకు తగ్గిపోయాయి.
టెలికాం రంగంలో కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త ప్రాజెక్టులకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. 3్భరత్ నెట్2 ఇందులో భాగమే. ఈ పథకం కింద దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలను హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్‌తోఅనుసంధానిస్తారు. అయితే దీన్ని దశలవారీగా చేపట్టనున్నారు. 32017 డిసెంబర్ నాటికి భారత్ నెట్ తొలి దశ కింద దేశంలో లక్ష గ్రామ పంచాయతీలకు బ్రాండ్ బ్యాండ్ కనెక్టివిటీ సదుపాయం కల్పించడం పూర్తయింది. ఈ మొత్తం ప్రాజెక్టు 2019 మార్చి నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. చిట్టచివరి ప్రాంతాలకు కూడావైఫై లేదా మరే ఇతర సముచిత బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ కల్పించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం2 అని మంత్రి అన్నారు.
2018, మార్చి 25 నాటికి, 2,68,963 కిలోమీటర్ల మేర ఆధికారిక ఫైబర్ కేబుళ్ల (ఓఎఫ్‌సీ) నిర్మాణం, మొత్తం 1,13,964 గ్రామ పంచాయతీలను కవర్ చేసింది. కాగా 1,04,889 గ్రామ పంచాయతీలను సర్వీసు సదుపాయాలను వినియోగించుకోవడానికి సిద్ధం చేశారు.
ఇక ఈశాన్య భారత్ విషయానికి వస్తే, మొత్తం 2,817 మొబైల్ టవర్లను నిర్మించేందుకు వీలుగా బీఎస్‌ఎన్‌ఎల్‌తో, ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నదని మంత్రి పేర్కొన్నారు. వీటి ద్వారా మొబైల్ కవరేజీ పరిధిలోకి రాని 4,119 గ్రామాలకు ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్, భారత్ హెగ్జాకామ్ లిమిటెడ్‌లతో కూడా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నదని, ఈ మేరకు అవి 2004 మొబైల్ టవర్లను నిర్మిస్తాయని మంత్రి సభకు చెప్పారు. వీటి ద్వారా జాతీయ రహదారి పక్కనే ఉన్న 2,128గ్రామాలు అనుసంధానమవుతాయన్నారు. ఇదిలావుండగా వామపక్ష ఉగ్రవాద పీడిత ప్రాంతాల్లో మొబైల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొని రావాల్సిన 4,072 లొకేషన్లను హోం మంత్రిత్వశాఖ గుర్తించిందన్నారు. రెండో దశలో వీటి నిర్మాణం చేపడతామన్నారు. ఇందుకు రూ.7,330 కోట్లు ఖర్చుకాగలదన్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన మంత్రివర్గ పరిశీలనలో ఉన్నదని సిన్హా తెలిపారు.