బిజినెస్

పన్ను రిటర్న్‌లకు ఆధార్ ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో, ఆధార్ నెంబరును పేర్కొనడం, ఈ-ఫైలింగ్‌లో పాన్‌తో, ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు, పన్ను అథారిటీ సీబీడీటీ స్పందనను కోరింది. ఇద్దరు లాయర్లు ఈ అంశాన్ని జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ ఎ.కె. ఛావ్లాలతో కూడిన బెంచ్ ముందుకు తీసుకొచ్చారు. వీరిలో ఒకరు సీనియర్ అడ్వకేట్. ఈయన దాఖలు చేసిన ఈ-ఫైలింగ్‌ను, ఆధార్ నెంబరు లేదన్న కారణంగా ఆదాయపు పన్ను శాఖ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వీరు దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు.. సెంటర్ అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ)కు నోటీసు జారీ చేస్తూ, ఆధార్ నెంబరు లేకుండానే వీరి ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఎందుకు ఆమోదించకూడదో తెలపాలని ఆదేశించింది. ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో ఆధార్ నెంబరు లేదా దాని ఎన్‌రోల్‌మెంట్ నెంబరును పేర్కొనాలని ఒత్తిడి తీసుకురావద్దని హైకోర్టు ఆదేశించింది. కాగా దీనిపై తదుపరి విచారణను మే 14కు వాయిదా వేసింది. ఈ లాయర్ల తరపున తన వాదనలు వినిపించిన మరో న్యాయవాది కీర్తీ ఉప్పల్, 3ఆధార్ అనుసంధానాన్ని, మళ్లీ తాను ఆదేశాలు జారీ చేసేవరకు సుప్రీకోర్టు పొడిగించిన నేపథ్యంలో, ఐటీ శాఖ, ఆధార్‌నెంబరును పేర్కొనాలని ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సబబని2 ప్రశ్నించారు. ఈవిధంగా పన్ను రిటర్న్‌లను తిరస్కరించడం నిర్హేతుకమని ఆయన వాదించారు. ఆదాయపుపన్ను సబ్-రూల్ 12(3) కింద పిటిషనర్లు ఐటీ డిపార్ట్‌మెంట్ విధానాన్ని సవాలు చేశారు. ఆధార్ నెంబర్లను పేర్కొనమనడం రాజ్యాంగంలోని 14, 21 అధికరణలను ధిక్కరించడమేనని వారు పేర్కొన్నారు.