తెలంగాణ

పరిశ్రమలకు ఎర్ర తివాచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ఎర్రతివాచీ పరిచింది. తెలంగాణ ఆవిర్భావం, టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి టిఎస్‌ఐ పాస్ చట్టాన్ని తెచ్చారు. దీని వల్ల 6206 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. మొత్తం రూ.1.18 లక్షల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 4.47 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. అనుమతులు పొందిన పరిశ్రమల్లో 3703 పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బి జినెస్ సంస్కరణలో దేశం మొత్తం మీద అగ్ర స్థానం లో ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏ ర్పాటుకు పారిశ్రామికవేత్తలు మొగ్గుచూపుతున్నట్లు అసెంబ్లీ వేదికగా ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన విషయం విదితమే. ఈ ఏడాది బడ్జెట్‌లో పరిశ్రమల శాఖకు రూ.1286 కోట్లను కేటాయించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల వద్ద ఎకో ఫా ర్మా సిటీకి రంగం సిద్ధం చేశారు. 19331 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఫార్మాసిటీ ప్రారంభమైన తర్వాత 4 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఖమ్మం జి ల్లా బుగ్గపాడులో మెగాఫుడ్ పార్కును నెలకొల్పేందుకు రాష్ట్రప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సంగారెడ్డి జిల్లా సు ల్తాన్‌పూర్‌లో వైద్య పరికరాల పా ర్కును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు సాధారణ కేటగిరీ ఔత్సాహికులకు రూ. 256.14 కోట్ల నిధులను కే టాయించారు. సబ్సిడీ కిం ద ఎంపిక చేసి న వారికి ని ధులిస్తారు. భూ మార్పి డి చార్జీలు, ఫీ జు రీయంబర్స్‌మెంట్ రాయితీలను పె ద్ద, మెగా, మధ్య తరహా ప్రాజెక్టులకు ఇవ్వనున్నారు. ఈ కేటగిరీలో సబ్సిడీ కింద రూ,. 172.25 కోట్ల నిధులు కేటాయించారు. విద్యుత్ సబ్సిడీ కింద రూ. 130 కోట్ల ను, ఆహార ప్రోసెసింగ్ యూనిట్లకు పావలా వడ్డీ పథకం కింద రూ. 100 కోట్లను కేటాయించారు. ఉ త్పాదకత, నవీకరణ, భద్రత కోసం రూ. 25 లక్షలను ఇస్తారు. లఘు చిన్నతరహా పరిశ్రమ రంగాల్లోక్లస్టర్ల అభివృద్ధికి రూ.25 లక్షలు, పారిశ్రామిక ప్రదర్శనల్లో అభివృద్ధి కార్యక్రమాలకు రూ.30 కోట్లు, పరిశ్రమల శాఖ కమిషనరేట్, జిల్లా పరిశ్రమ కేంద్రాల ఆటోమేషన్, ఆధునీకరణకు రూ. 2 కోట్లు, ఖాయిలా పడిన పరిశ్రమలకు చేయూత ఇచ్చేందుకు రూ. 40 కోట్లు, వౌ ళిక సదుపాయాల అభివృద్ధికి రూ.104.75 కో ట్లు, హైదరాబాద్‌లోని పరిశోధన, వినూత్న సర్కిల్ కు రూ. 4 కోట్లు, ఫార్మా సిటీ, ఇతర పరిశ్రమల భూసేకరణకు రూ. 100 కోట్లు కేటాయించారు.
రాష్ట్రంలో చేనేత, జౌళి శాఖకు రూ. 1200 కోట్లను కేటాయించారు. వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్ సిటీ ఏర్పాటుకు 22సంస్థలతో ప్రభుత్వం రూ. 3440 కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పార్కును రూ.1075 కోట్లతో 1190 ఎకరాల్లో ఏర్పా టు చేయనున్నారు. దీనిని సీఎం కేసీఆర్ సవాలుగా స్వీకరించి స్వ యంగా పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.9వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని అం చనా. దేశంలోనే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు అతి పెద్దదిగా పేరు తెచ్చుకోనున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటించింది. దీంతో 80 వేల మందికి ఉపాధి లభించనుంది. జౌళి పరిశ్రమ సిరిసిల్లకు ఆర్థిక సాయం, గద్వాల, పోచంపల్లి చేనేత పార్కు, కొత్త పార్కుల డీపీఆర్‌ల తయారీ, మరమగ్గాల సర్వీసు సెంటర్లకు సహాయం, మరమగ్గాలకు 50 శాతం రాయితీ, సాధారణ మగ్గాల ఆధునీకరణ కింద రూ. 431 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పరిశ్రమాభివృద్ధికి రూ. 289 కోట్లను కేటాయించింది.