బిజినెస్

గ్యాస్ వెలికితీతలో నిబంధనల సడలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా, సహజవాయువును వెలికి తీసేందుకు వీలుకల్పిస్తూ అందుకు అనువుగా నిబంధనల సడలింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో సంస్థ ఆధీనంలోని బొగ్గు బ్లాకుల దిగువన సహజవాయువు ఉన్నట్లయితే దాన్ని వెలికి తీయడానికి మార్గం సుగమమైంది. ముఖ్యంగా ఉత్పత్తిని మరింత వేగంగా పెంచేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఇప్పటి వరకు కోల్-బెడ్ మీథేన్‌ను వెలికి తీయడానికి కేంద్ర చమురు మంత్రిత్వశాఖకు లైసెన్స్‌కోసం దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. 1948 చమురు క్షేత్రాల (నియంత్రణ అభివృద్ధి) చట్టంలోని 12వ సెక్షన్ కింద, 2015లో చమురు మంత్రిత్వశాఖ రూపొందించిన నిబంధనలను, ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సడలించింది. దీంతో కోల్ ఇండియా దాని అనుబంధ సంస్థలు సహజవాయువు వెలికితీతకు లైసెన్స్‌కు దరఖాస్తు చేయనవసరం లేదు. ‘దీనివల్ల బొగ్గు ఆధారిత మీథేన్ వాయువు వెలికి తీయడానికి, ఉద్యోగాల కల్పనకు, ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగం పుంజుకోవడానకి వీలవుతుంది’ అని అధికారిక ప్రకటన వెల్లడించింది. బొగ్గు బ్లాకులున్న ప్రాంతాల్లో గ్యాస్ అనే్వషణ, వెలికితీసేందుకు కోల్ ఇండియాకు వీలు కల్పిస్తూ, 2015, నవంబర్ 3న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.