బిజినెస్

మళ్లీ 34వేల స్థాయికి సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 12: ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నిరుత్సాహపూరిత వాతావరణం నెలకొన్నప్పటికీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ) షేర్లలో వచ్చిన ర్యాలీతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ వరుసగా ఆరో సెషన్‌లో పుంజుకొని, కీలకమయిన 34,000 స్థాయికి పైన ముగిసింది. బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ 3.18 శాతం పుంజుకుంది. ఇండెక్స్‌లోని దిగ్గజ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మంచి లాభాలు గడించాయి. సెనె్సక్స్ 160 పాయింట్లు పుంజుకొని, 34,101.13 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 41.50 పాయింట్లు పెరిగి, 10,458.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. సిరియా అంశంపై అమెరికా, రష్యాల మధ్య వైరం ముదరడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో మదుపరులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే, విదేశీ నిధులు తాజాగా తరలిరావడంతో పాటు దేశీయ సంస్థాగత మదుపరులు భారీగా కొనుగోళ్లకు పూనుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ప్రతికూల అంశాన్ని అధిగమించి బలపడ్డాయి. కార్పొరేట్ కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు వెలువడటం ప్రారంభం కానున్న తరుణంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆశావహ దృక్పథం నెలకొందని బ్రోకర్లు చెప్పారు. సెనె్సక్స్ అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, మరింత ముందుకు సాగుతూ ఇంట్రా-డేలో 34,177.44 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో 33,924.28 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 160.69 పాయింట్ల (0.47 శాతం) లాభంతో 34,101.13 పాయింట్ల వద్ద ముగిసింది. ఫిబ్రవరి 28న 34,184.04 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్, ఆ తరువాత ఇంత గరిష్ఠ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. ఈ సూచీ గత ఆరు సెషన్లలో కలిసి 1,082.06 పాయింట్లు పుంజుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 10,469.90- 10,395.25 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 41.50 పాయింట్ల (0.40 శాతం) లాభంతో 10,458.65 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా, బుధవారంనాటి లావాదేవీల్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 362.30 కోట్ల విలువయిన షేర్లను, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 111.82 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.
గురువారంనాటి లావాదేవీల్లో సెనె్సక్స్ ప్యాక్‌లోని టీసీఎస్ అత్యధికంగా 4.04 శాతం లాభపడింది. ఇన్ఫోసిస్ 3.41 శాతం లాభంతో తరువాత స్థానంలో నిలిచింది. విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజి, టెక్ మహీంద్రా వంటి ఇతర ఐటీ కంపెనీలు 4.47 శాతం వరకు లాభపడ్డాయి. సెనె్సక్స్ ప్యాక్‌లోని లాభపడిన ఇతర సంస్థల్లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, ఆసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ తదితర సంస్థలు ఉన్నాయి.