బిజినెస్

మరింత బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 13: స్థూలార్థిక గణాంకాలు అంచనాలకు మించి సానుకూలంగా ఉండటంతో పాటు కార్పొరేట్ కంపెనీల నాలుగో త్రైమాసిక (క్యూ 4) ఫలితాలు బాగుంటాయన్న మదుపరుల అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. మధ్యాహ్నం తరువాత కొంత అనిశ్చితి నెలకొన్నప్పటికీ మార్కెట్ కీలక సూచీలు దానిని అధిగమించి, ఆరు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దేశీయ మార్కెట్ కీలక సూచీలు పుంజుకోవడం ఇది వరుసగా ఏడో సెషన్. నిరుడు నవంబర్ తరువాత వరుసగా ఇన్ని సెషన్లు సూచీలు పుంజుకోవడం ఇదే మొదటిసారి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ శుక్రవారం 91.52 పాయింట్లు పుంజుకొని, 34,192.65 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి, 10,480.60 పాయింట్ల వద్ద స్థిరపడింది. 34,313.14- 34,103.53 పాయింట్ల మధ్య కదలాడిన సెనె్సక్స్ చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 91.52 పాయింట్లు (0.27 శాతం) పుంజుకొని, 34,192.65 పాయింట్ల వద్ద ముగిసింది. ఫిబ్రవరి 27న 34,346.39 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్, ఆ తరువాత ఇంత అధిక స్థాయి వద్ద ముగియడం ఇదే మొదటిసారి. ఈ సూచీ గత ఏడు సెషన్లలో కలిపి 1,173.58 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ శుక్రవారం క్రితం ముగింపుతో పోలిస్తే 21.95 పాయింట్లు (0.21 శాతం) పుంజుకొని, 10,480.60 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఈ సూచీ 10,519.90- 10,451.45 పాయింట్ల మధ్య కదలాడింది. ఈ రెండు సూచీలు కూడా వరుసగా మూడో వారం పుంజుకున్నాయి. ఈ వారం సెనె్సక్స్ గణనీయంగా 565.68 పాయింట్లు (1.68 శాతం) పుంజుకోగా, నిఫ్టీ 149 పాయింట్లు (1.44 శాతం) పెరిగింది. ఇదిలా ఉండగా, గురువారంనాటి లావాదేవీల్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 368.90 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 615.81 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
శుక్రవారంనాటి లావాదేవీల్లో సెనె్సక్స్ ప్యాక్‌లోని అదాని పోర్ట్స్ అత్యధికంగా 2.66 శాతం లాభపడింది. విప్రో 2.28 శాతం లాభంతో తరువాత స్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్ నాలుగో త్రైమాసిక ఫలితాలు ఇంకా వెలువడకముందే, ఫలితాల పట్ల సానుకూల అంచనాతో ఉన్న మదుపరులు తాజా కొనుగోళ్లకు పూనుకోవడంతో దాని షేర్ విలువ 0.58 శాతం పెరిగింది. శుక్రవారం లాభపడిన ఇతర సంస్థల్లో కోటక్ బ్యాంక్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ 1.22 శాతం పెరిగింది. గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియడంతో దాని సానుకూల ప్రభావంతో చాలా మట్టుకు ఆసియా, ఐరోపా స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభపడ్డాయి.