బిజినెస్

తగ్గిన టాటా స్టీల్ ఉత్పత్తి, విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 13: ఉక్కు ఉత్పత్తి దిగ్గజం టాటా స్టీల్ దేశీయ విక్రయాలు మార్చి 31తో ముగిసిన 2017-18 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 6.23 శాతం తగ్గాయి. ఈ త్రైమాసికంలో కంపెనీ 3.01 మిలియన్ టన్నుల ఉక్కును విక్రయించింది. అలాగే కంపెనీ ఉక్కు ఉత్పత్తి కూడా నాలుగో త్రైమాసికంలో 4.06 శాతం తగ్గింది. కంపెనీ ఈ కాలంలో 3.07 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది. టాటా స్టీల్ 2016-17 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశీయ మార్కెట్‌లో 3.21 మిలియన్ టన్నుల ఉక్కును విక్రయించింది. ఈ కాలంలో కంపెనీ 3.20 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది. కళింగనగర్ ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్ చెడిపోవడం ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఉత్పత్తి, విక్రయాలు తగ్గిపోవడానికి ప్రధాన కారణమని టాటా స్టీల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2017-18 నాలుగో త్రైమాసిక కాలంలో ఐరోపాలోనూ టాటా స్టీల్ ఉక్కు విక్రయాలు తగ్గిపోయాయి. 2016-17 నాలుగో త్రైమాసికంలో 2.85 మిలియన్ టన్నులు ఉన్న ఈ విక్రయాలు 2017-18 నాలుగో త్రైమాసికంలో 2.48 మిలియన్ టన్నులకు పడిపోయాయి. ఉత్పత్తి పరిమాణంలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా 2.62 మిలియన్ టన్నులు ఉందని కంపెనీ వివరించింది. ఆగ్నేయాసియాలో ఉత్పత్తి, విక్రయాల పరిమాణంలో ఎలాంటి తేడా లేదని కంపెనీ పేర్కొంది.