బిజినెస్

సేవారంగంపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: రాష్ట్ర ఖజానాకు పన్నులు తెచ్చే వాణిజ్య శాఖ పన్ను ఆదాయాలను సమకూర్చే విభాగాలను ప్రక్షాళన చేపట్టడం వల్ల రాబడి పెరిగింది. కాని సేవారంగం (సర్వీసు సెక్టార్) పరిధిలో పన్ను వల్ల వచ్చే ఆదాయం కోల్పోకుండా గట్టిచర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య శాఖ నిర్ణయించింది. గత ఏడాది జూలై 1వ తేదీ నుంచి వస్తు సేవా పన్ను అమలులోకి వచ్చిన తర్వాత దాదా పు అన్ని శాఖల్లో సమూలాత్మకమైన మార్పులు తెచ్చారు. సర్వీసు విభాగంలో బీమా, విమాన ప్రయాణం, ఇ-కామర్స్, రైల్వేలు, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫంక్షన్ హాల్స్, బస్సులు, వర్క్ కాంట్రాక్ట్స్, కోచింగ్ ఇనిస్టిట్యూట్స్, ఐటి కంపెనీలు, మానవ వనరులను సమకూర్చే ఇతర సంస్థ లు ఉన్నాయి. ఇ- కామర్స్ సంస్థలు వివిధ రాష్ట్రాల్లోని తమ సంస్థల ఖాతాల్లోకి ఆదాయాన్ని జమ చేస్తున్నాయి. దీని వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నట్లు వాణి జ్య శాఖ గుర్తించింది. ఉదాహరణకు రాష్ట్రంలో 70 లక్షల మంది హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నారు. సర్వీసు పన్ను కింద ఆదాయం రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఈ ఆదాయం బుకింగ్ ఏజెంట్ల ఖాతాల్లోకి పోతోంది. ముంబాయి, ఢిల్లీ ఇతర నగరాల్లోని బుకింగ్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్లను బుక్ చేయడం వల్ల రాష్ట్ర ఖజనాకు సర్వీసు సెక్టార్ నుంచి పన్ను ఆదాయం రావడం లేదు. ఇతర రాష్ట్రాల్లో బుకింగ్ ఏజెంట్ల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. అక్కడ ఉన్న బ్యాంకుల ఖాతాల్లోకి సొమ్ము జమవుతోంది. వీటి ప్రధాన కార్యాలయాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక్కడ చెల్లించే సొమ్ము వేరే రాష్ట్రాల బ్యాంకుల్లో క్రెడిట్ అవుతోంది. సాధారణంగా వీటి నుంచి 15 నుంచి 18 శాతం వరకు సర్వీసు ట్యాక్స్ రాష్ట్రానికి రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు నిర్వహించే సంస్థల నియంత్రణపై నిర్దిష్ట చట్టాలు లేవు. ఈవిషయమై న్యాయ నిపుణులను సంప్రదించే విషయమై రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. అవసరమైతే ఒక చట్టాన్ని తీసుకువచ్చేందుకు మార్గాలను రాష్ట్రప్రభుత్వం ఆనే్వషిస్తోంది.