బిజినెస్

ఎస్‌ఓసీని ఏర్పాటు చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: దేశంలో అన్ని విభాగాల్లో ఉన్న సమాచార టెక్నాలజీ ఆస్తులను, వ్యవస్థను పర్యవేక్షించేందుకు, సైబర్ ఫ్రాడ్స్ నేరాలను అరికట్టేందుకు సెంట్రల్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్‌ఓసీ)ని ఏర్పాటు చేయాలని అసోచామ్ అనే జాతీయ వాణిజ్య సంస్థ కేంద్రానికి సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది. ఈ వివరాలను అసోచామ్ ప్రకటనలో విడుదల చేసింది. అసోచామ్, పిడబ్ల్యుసి సంస్థ ఉమ్మడిగా సైబర్ నేరాలను అరికట్టే విధానాలపై అధ్యయనం చేసి విధానపత్రాన్ని రూపొందించాయి. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్రం వెంటనే రంగంలోకి దిగాలన్నారు.ప్రభుత్వం, పరిశ్రమలు, సైబర్ సెక్యూరిటీని కల్పించే పరిశోధన సంస్థలు ఒక వేదికపైకి రావాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర, కేంద్ర నిఘా సంస్థలు, వివిధ కేంద్ర, రాష్ట్రప్రభుత్వ శాఖలను ఈ వ్యవస్థలో భాగస్వాములను చేయాలన్నాయి. ఒక సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించాల్సిన తరుణం ఆసన్నమైందని అసోచామ్ పేర్కొంది. ఇతర దేశాలతో కలిసి పనిచేసే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కోరాయి.
అంతర్జాతీయంగా జరిగే సైబర్ నేరాలను అరికట్టే సదస్సుల్లో మన దేశం తరఫున ప్రతినిధులు పాల్గొనాలని విధానపత్రంలో అసోచామ్ పేర్కొంది. సైబర్ సెక్యూరిటీని అరికట్టడంలో సింగపూర్ ప్రభుత్వం అంతర్జాతీయంగా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఐటి నైపుణ్యం, సైబర్ నేరాలను పసిగట్టడంలో నిపుణులను తయారు చేసుకోవాలన్నారు. విద్యా రంగంలో కూడా సైబర్ సెక్యూరిటీ ప్రొగ్రాంలను చేర్చాలన్నారు.