బిజినెస్

త్రైమాసిక ఫలితాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఐటీ థిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సహా పలు కార్పొరేట్ కంపెనీల నాలుగో త్రైమాసిక (క్యూ 4) ఫలితాలు, స్థూలార్థిక గణాంకాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయనేది నిపుణులు అంచనా. 3కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు అర్థవంతమయిన రీతిలో పుంజుకోవడం అనేది భారత స్టాక్ మార్కెట్ల పటిష్ఠత కొనసాగడానికి కీలకంగా ఉంటుంది2 అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. భారతదేశ అతి పెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ టీసీఎస్ తన నాలుగో త్రైమాసిక ఫలితాలను ఈ నెల 19న వెలువరించనుంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఏసీసీ, మైండ్‌ట్రీ, క్రిసిల్, రిలయన్స్ పవర్ సంస్థలు కూడా ఈ వారంలో తమ నాలుగో త్రైమాసిక ఫలితాలను వెలువరించనున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఈ కంపెనీలు సాధించిన ఆదాయాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ సరళిని నిర్దేశించనున్నాయి. 3పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ), వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు ఇప్పటికే వెలువడినందున మదుపరులు ఇప్పుడు టోకు ధరల (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాల కోసం వేచి చూస్తున్నారు. మార్చి నెల టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ నెల 16న వెలువడనున్నాయి2 అని అరిహంట్ క్యాపిటల్ మార్కెట్స్ హోల్ టైమ్ డైరెక్టర్ అనితా గాంధీ పేర్కొన్నారు. గత వారం వెలువడిన అధికారిక స్థూలార్థిక గణాంకాలు ఫిబ్రవరి నెలలో దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆరోగ్యవంతమయిన రీతిలో 7.1 శాతం పుంజుకుందని, మార్చి నెలలో సీపీఐ ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం అయిదు నెలల కనిష్ట స్థాయి 4.28 శాతానికి పడిపోయిందని వివరించాయి. అమెరికా, చైనాల మధ్య తగ్గిన వాణిజ్య పోరు ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తాయని, అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల ఇప్పటికీ స్టాక్ మార్కెట్‌ను ఆందోళనకు గురి చేస్తోందని గాంధీ పేర్కొన్నారు. రసాయనిక ఆయుధ దాడికి ప్రతిచర్యగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు బషర్ అల్ అసద్ నేతృత్వంలోని సిరియా ప్రభుత్వ దళాలపై వైమానిక దాడులకు పాల్పడిన తరువాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. 3ఇప్పటి వరకు వెలువడిన దేశ స్థూలార్థిక గణాంకాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి ఆరోగ్యకరమైన వృద్ధిని కొనసాగిస్తోంది. చిల్లర ద్రవ్యోల్బణం మరింత తగ్గింది2 అని నాయర్ పేర్కొన్నారు. 3అయితే, కొన్ని ప్రతికూల సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మధ్య ప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, దేశంలో 10 ఏళ్ల బాండ్ ధరలలో నెలకొన్న అనిశ్చితి దేశీయ స్టాక్ మార్కెట్‌కు ప్రతికూలాంశాలుగా ఉన్నాయని నాయర్ పేర్కొన్నారు.