బిజినెస్

రియల్ ఎస్టేట్‌కు వెసులుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 17: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందింది జీఎస్టీ అమల్లోకి వచ్చిన గత ఏడాది జూలై తర్వాత చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులకేనని ఒక నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా గృహాల కొనుగోలుదార్లకు జీఎస్టీ ఫలాలు అందినప్పటికీ, ప్రభుత్వం ఆశించినంత స్థాయిలో లేవని పేర్కొంది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి జీఎస్టీ మరింత సరళతరం కావడంతో వ్యాల్యుయేషన్ వంటి దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలనుంచి బయటపడటానికి వీలైందని జేఎల్‌ఎల్, పీడబ్ల్యుసిలు మంగళవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అవసరమైన మెటీరియల్ కొనుగోలుకు వీలు కల్పించే ఇన్‌పుట్ క్రెడిట్ పెంపుదల వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో వెసులుబాటు కలిగిందని నివేదిక స్పష్టం చేసింది. ‘జీఎస్టీని అమలు చేసిన తర్వాత దాని ప్రయోజనాలు చిట్టచివరి వినియోగదారుడికి అందాలన్నది ప్రభుత్వం ఆకాంక్ష. కానీ అనుకున్న స్థాయిలో అది నెరవేరలేదు’ అని పేర్కొంది. ఇన్‌పుట్ క్రెడిట్ పెరగడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుందన్న మాట నిజమే. కానీ ఒక అపార్ట్‌మెంట్‌లో, నిర్మాణం ఖర్చుతో పాటు భూమి ధర కూడా కీలక పాత్ర పోషిస్తుందన్న సంగతి మరువరాదు అని వివరించింది. అందువల్ల కొత్త పన్నుల విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన ప్రాజెక్టులు మాత్రమే ప్రయోజనం పొందగలవని, జీఎస్టీ అమల్లోకి రాకముందు ప్రారంభించిన ప్రాజెక్టులకు లాభం ఉండదని నివేదిక వెల్లడించింది. ‘ఏది ఏమైనా చాలా వరకు ప్రాజెక్టుల్లో మొత్తం నిర్మాణ వ్యయంలో మూడు శాతానికి మించి ప్రయోజనం ఉండదని, అందువల్ల వినియోగదారులకు తక్కువ ధరకే ఇళ్లు లభిస్తాయనుకోవడం ఒట్టి భ్రమ’ అని నివేదిక స్పష్టం చేసింది.