బిజినెస్

బ్యాంకులపై విశ్వాసం సడలనీయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోకుండా చూడాల్సిన తరుణం ఆసన్నమైందని, ఆర్థికపరమైన అంశాల్లో ప్రస్తుతం జరుగుతున్న తప్పులను సరిదిద్దకపోతే బ్యాంకులు కునారిల్లుతాయని అఖిల భారత ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐఆర్‌ఆర్‌బీఈఏ) సెక్రటరీ జనరల్ ఎస్. వెంకటేశ్వరరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి గురువారం ఆయన ఒక లేఖ రాశారు. బ్యాంకులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న దురవస్థకు కారణాలు వివరిస్తూ, పరిష్కార మార్గాలను వెంటనే చేపట్టాల్సి ఉందని తన లేఖలో పేర్కొన్నారు.
పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలు అనేక ఇక్కట్లకు గురయ్యారని అప్పటి నుండే బ్యాంకుల పట్ల నమ్మకం సన్నగిల్లుతూ వస్తోందని వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు వల్ల ప్రజలు దోపిడీకి గురవుతారన్న ప్రచారం జరగడంతో బ్యాంకులపై ఖాతాదారులకు పూర్తిగా నమ్మకం పోయిందన్నారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే బ్యాంకులు ఆర్థిక సంక్షోభానికి గురవుతాయని హెచ్చరించారు. గత ఏడాది కాలంగా బ్యాంకులకు డిపాజిట్లు రావడం దాదాపు నిలిచిపోయిందని, ఇదే సమయంలో బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును ప్రజలు ఉపసంహరించుకుంటున్నారని గుర్తు చేశారు. ఈ డబ్బు భూముల కొనుగోలు, బంగారు కొనుగోలు, వ్యాపారంలో పెట్టుబడులు తదితర విధాల ప్రజలు ఉపయోగిస్తున్నారన్నారు. చిన్నచిన్న వ్యాపారులు, గృహిణులు, వృద్ధులు, మధ్యతరగతి ప్రజలు తమ డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటే, ఆదాయం పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తూ, వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. బ్యాంకుల్లో ప్రజలు దాచుకునే డబ్బుపై వడ్డీ గతంలో 11 శాతం ఇస్తుండగా, దీన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చి, 6.50 శాతానికి తగ్గించారని, దాంతో వడ్డీపై ఆధారపడ్డ సీనియర్ సిటిజన్లు ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. కనీస బ్యాలెన్స్ పేరుతో పజలను వేధింపులకు గురి చేస్తున్నారని వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. 2000 రూపాయలు బ్యాలెన్స్ ఉన్న ఒక వ్యక్తిపై రకరకాల చార్జీలు వేస్తూ 7-8 నెలల్లో బ్యాలెన్స్ ఖాళీ చేస్తున్నారని గుర్తు చేశారు.
ఇవీ పరిష్కార మార్గాలు
డీఐసీజీసి కింద ఇన్సూరెన్స్‌ను ఒక లక్ష రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచాలని, ప్రతిపాదిత ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించాలని వెంకటేశ్వరరెడ్డి కోరారు. బ్యాంకు ఖాతాదారులు ఆదాయం పన్ను అధికారుల వేధింపులకు గురికాకుండా చూడాలన్నారు. వ్యక్తిగత డిపాజిట్లు 1.50 లక్షల వరకు ఉంటే ఆదాయం పన్ను మినహాయింపు ఉందని, దీన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచాలన్నారు. టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) 10 వేల రూపాయల నుండి లక్ష రూపాయలకు పెంచాలని సూచించారు. సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై మూడుశాతం వడ్డీ అదనంగా కేంద్రం ఇవ్వాలని సూచించారు. బ్యాంకింగ్ సేవలపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం జీఎస్‌టీని వెంటనే ఉపసంహరించాలని, ఖాతాదారులపై వేస్తున్న వేర్వేరు చార్జీలను ఉపసంహరించాలని వెంకటేశ్వర రెడ్డి తన లేఖలో కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు.