బిజినెస్

మళ్లీ బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 19: అంతర్జాతీయ మార్కెట్‌లో లోహాల ధరలు పెరగడంతో అందుకు అనుగుణంగా లోహపు (మెటల్) కంపెనీల షేర్లకు భారీగా డిమాండ్ పెరగడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం బలపడ్డాయి. స్టాక్ మార్కెట్లలో లావాదేవీలు ఊగిసలాట మధ్య సాగినప్పటికీ, లోహపు షేర్ల ధరలు పుంజుకోవడం వల్ల కీలక సూచీలు పైకి ఎగబాకాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) మెటల్ ఇండెక్స్ గురువారం అన్ని సూచీలకన్నా అత్యధికంగా 4.46 శాతం పుంజుకుంది. రష్యా తయారీ సంస్థ రసల్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో అల్యూమినియం ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్‌లో లోహ రంగ షేర్లకు డిమాండ్ పెరిగింది. అమెరికాపై రష్యా ప్రతీకార చర్యలకు దిగుతుందేమోననే భయాందోళనలు నెలకొని నికెల్ వంటి లోహాల ధరలు కూడా పెరిగాయి. చమురు సరఫరాలకు ఆటంకాలు ఎదురవుతాయేమోనన్న ఆందోళన నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు మూడున్నరేళ్ల గరిష్ఠ స్థాయికి పెరిగాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సహా కొన్ని కీలకమయిన కంపెనీల ఫలితాలు వెలువడనుండటంతో గురువారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్‌లో మదుపరుల సెంటిమెంట్ బలంగా ఉండిందని బ్రోకర్లు తెలిపారు. దీంతో బీఎస్‌ఈ సెనె్సక్స్ 96 పాయింట్లు పుంజుకొని 34,427.29 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 39 పాయింట్లు పెరిగి, 10,565.30 పాయింట్ల వద్ద స్థిరపడింది. గురువారం ఉదయం అధిక స్థాయి వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ మరింత పైకి ఎగబాకుతూ ఇంట్రా-డేలో 34,478.82 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది. అయితే, తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో 34,358.91 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగజారింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 95.61 పాయింట్ల (0.28 శాతం) లాభంతో 34,358.91 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం సెషన్‌లో ఈ సూచీ 63.38 పాయింట్లు దిగజారిన విషయం విదితమే. నిఫ్టీ గురువారం 10,572.20- 10,546.20 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 39.10 పాయింట్లు (0.37 శాతం) పుంజుకొని, 10,565.30 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇదిలా ఉండగా, బుధవారంనాటి లావాదేవీల్లో దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నికరంగా రూ. 869.70 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 915.71 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
గురువారంనాటి లావాదేవీల్లో లోహ రంగ సంస్థల్లో నాల్కో, హిండాల్కో, వేదాంత, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్, హిందుస్తాన్ జింక్, టాటా స్టీల్, ఎన్‌ఎండీసీలు తొమ్మిది శాతం వరకు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏడు నెలల కనిష్ట స్థాయికి చేరడంతో ఐటీ షేర్ల ధరలు పెరిగాయి. నాలుగో త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న టీసీఎస్ షేర్ విలువ 0.99 శాతం పెరిగింది. స్టాక్ మార్కెట్ పనివేళలు ముగిశాక ఈ కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి.
సెనె్సక్స్ ప్యాక్‌లోని టాటా స్టీల్ షేర్ ధర అత్యధికంగా 3.17 శాతం పుంజుకుంది. యెస్ బ్యాంక్ 2.83 శాతం లాభంతో రెండో స్థానంలో నిలిచింది. భారతి ఎయిర్‌టెల్ 2.64 శాతం, ఎల్‌అండ్‌టీ 1.74 శాతం చొప్పున లాభపడ్డాయి. లాభపడిన ఇతర సంస్థల్లో పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, అదాని పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిల్, హెచ్‌యూఎల్ ఉన్నాయి. మరోవైపు, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, కోటక్ బ్యాంక్, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్ నష్టపోయాయి. నాలుగో త్రైమాసికంలో నికర లాభం 27 శాతం పెరిగినప్పటికీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ విలువ 0.57 శాతం పడిపోయింది.