బిజినెస్

ఎకరం భూమిలో వంద పంటలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 20: ఎకరం భూమిలో వంద రకాల పంటలు..! అవును ఇది నిజమే. మహారాష్టల్రోని కొల్హాపూర్ జిల్లా రైతాంగం సేంద్రీయ పద్దతులతో ఇలా వంద పంటలను పండిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఒక కుటుంబానికి కావాల్సినవన్నీ ఆ ఎకరం భూమిలోనే సాగు చేసుకుంటున్నారు. సేంద్రీయ విధానంలో జరుగుతున్న ఈ సాగుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ పరిశీలనచేస్తోంది. కొల్హాపూర్ విధానాన్ని రాష్ట్రంలో ప్రాధాన్యత పద్దతుల్లో అమలుచేస్తే అన్నదాత సుభిక్షంగ ఉంటాడని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మహారాష్టల్రోని కొల్హాపూర్ జిల్లాకు చెందిన రైతాంగం తమ జీవనానికి అవసరమైన దాదాపు అన్ని పంటలను ఎకరం భూమిలోనే పండించుకుంటారు. ఎటువంటి ఎరువులు, పురుగుమందులను అక్కడి రైతాంగం వినియోగించరు. కేవలం జీవామృతం, ఘనజీవామృతంతో మాత్రమే పండిస్తారు. ఎకరం భూమి సరిహద్దుల్లో కొబ్బరి, మునగ వంటి పెద్ద చెట్లను వేసుకుంటారు. వాటి ఫలసాయాన్ని తీసుకుంటారు. ఇక లోపల భాగంలో వరి, కందులు, మినుము లు, పెసర, ఆకుకూరలు, కూరగాయలు తదితర సుమారు వంద రకాల పంటలను సాగుచేస్తారు. ఒక కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల ఆహార పంటలు సాగుచేసుకుని, వాటినే వినియోగించుకుంటారు. అలాగే ఆ ఎకరం భూమిలోనే గేదెలు, గోవులను మేపుతారు. వాటి పాలను ఉపయోగించుకోవడంతోపాటు వాటి నుండి వచ్చే పేడతో గోబర్ గ్యాస్, పంటలకు అవసరమైన జీవామృతాన్ని తయారుచేసుకుంటారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రీయ పద్ధతిలో సాగుకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ ద్వారా రైతాంగానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజన్సీ (ఆత్మ) ద్వారా ఆయా రాష్ట్రాల్లోని వ్యవసాయ దాని అనుబంధ సాగును పరిశీలించడానికి అవకాశం కల్పించింది. పంటలకు ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల మానవాళి ఆరోగ్యానికి హానికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి వాటిని అరికట్టడానికి సేంద్రీయ విధానంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చి మ గోదావరి జిల్లా నుంచి భీమవరం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతాంగం కొల్హాపూర్‌లో పర్యటించింది. ఎకరంలో వంద పంటల విధానానికి గోదావరి జిల్లాల్లోని రైతాంగం శ్రీకారం చుట్టింది. ఇప్పుడిప్పుడే వీరవాసరం, భీమవరం, తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాల్లో తక్కు వ రకాలతో కొల్హాపూర్ తరహా సాగు ఆరంభమైంది. దీన్ని దశలవారీగా విస్తరించనున్నారు.

చిత్రం..కొల్హాపూర్ జిల్లాలో సేంద్రీయ పద్ధతుల్లో సాగుచేస్తున్న పూలతోటలను పరిశీలిస్తున్న రైతు బృందం