బిజినెస్

140 మిలియన్ టన్నులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశ ముడి ఉక్కు ఉత్పత్తి ఈ సంవత్సరాంతం నాటికి 38 శాతం వృద్ధి రేటుతో 140 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేసినట్టు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ తెలిపారు. దేశంలో 2017లో 101.4 మిలియన్ టన్నుల ముడి ఉక్కు ఉత్పత్తి అయినట్టు ఆయన చెప్పారు. ఈ సంవత్సరం ఇది 140 మిలియన్ టన్నులకు పెరిగే అవకాశం ఉందని ఆయన ఒక వార్తాసంస్థ ప్రతినిధికి తెలిపారు. అంతకు ముందు ఆయన ఉక్కు ఉత్పత్తిని పెంచడానికి దేశంలో అందుబాటులో ఉన్న వనరులన్నింటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని స్టీల్ ఇండస్ట్రీని కోరారు. భారత్ ఫిబ్రవరిలో ముడి ఉక్కు ఉత్పత్తిలో 3.43 శాతం వృద్ధి రేటుతో 8.434 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయడం ద్వారా ఆసియాలో ఇండస్ట్రియల్ దిగ్గజమయిన జపాన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఫిబ్రవరిలో జపాన్ 8.296 మిలియన్ టన్నుల ముడి ఉక్కును ఉత్పత్తి చేసింది. ప్రపంచ ఉక్కు సంస్థ వరల్డ్‌స్టీల్ ప్రకారం, చైనా ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో కొనసాగుతోంది. భారత ప్రభుత్వం జాతీయ ఉక్కు విధానం (ఎన్‌ఎస్‌పీ) కింద 2030-31 నాటికి దేశంలో 300 మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. దేశంలో తలసరి స్టీల్ వినియోగాన్ని ప్రస్తుతం ఉన్న 70 కిలోగ్రాముల నుంచి 2030-31 నాటికి 158 కిలో గ్రాములకు పెంచాలని కూడా నిర్దేశించింది.