బిజినెస్

భారత్‌లో భారీ విద్యుత్ యంత్ర పరికరాల ఫ్యాక్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: భారత్‌లో భారీ విద్యుత్ యంత్ర పరికరాల తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు చైనాకు చెందిన వీఈఎం సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. 1886లో స్థాపించబడిన సంస్థ 86 దేశాల్లో వివిధ ప్రాజెక్టులకు విద్యుత్ యంత్ర పరికాలను సరఫరా చేస్తోంది. 0.06 కిలోవాట్ నుంచి 42 మెగావాట్ల సామార్థ్యం కలిగిన యంత్ర పరికరాలను తయారు చేసే వీఈఎం ఫ్యాక్టరీని తెలంగాణలో నెలకొల్పాలని చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ బృందం విజ్ఞప్తి చేసింది. సోమవారం షాంఘైలోని సంస్థ ప్రతినిధులతో ఇంజనీర్ ఇన్ ఛీఫ్ అనిల్ కుమార్, లిఫ్ట్ సలహాదారు పెంటారెడ్డి, సాగునీటి మంత్రి ఓఎస్‌డి శ్రీ్ధర్ రావు దేశ్‌పాండే, జన్‌కో ఇంజనీర్ వాసుదేవ్, నవయుగ ప్రతినిధి మల్లినాథ్ భేటీ అయ్యారు. రాష్ట్రం నుంచి చైనాకు వెళ్లిన ప్రతినిధి బృందానికి వీఈఎం సంస్థ జనరల్ మేనేజర్ హాంగ్ టావో హె స్వాగతం పలికారు. అనాదిగా చైనా, భారత్‌ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, బౌద్ధ ధర్మం భారత్ నుంచే చైనాకు చేరిందని గుర్తుచేశారు. సుమారు రెండు వేల ఏళ్ల క్రితమే చైనా యాత్రికులు ఫాహియాన్, హువాన్‌త్సాంగ్ లాంటివారు భారత్‌ను సందర్శించి అక్కడి విజ్ఞానాన్ని చైనాకు పరిచయం చేశారని పేర్కొన్నారు. యూరప్ దేశాల్లో పారిశ్రామిక విప్లవం ముగిసిందని, ఆసియా ఖండానికి చెందిన భారత్, చైనా దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తులుగా అవకాశం ఉందని పేర్కొన్నారు. రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవడం ద్వారా అద్బుతాలను సృష్టించే అవకాశం ఉందన్నారు. ఈ కృషిలో తమ సంస్థ కీలక పాత్ర పోషించాలని తాము భావిస్తున్నట్టు చెప్పారు. భారత్‌లో మా యూనిట్ స్థాపించాలని అనుకుంటే అందుకు తెలంగాణ అనుకూలమైనదని, తెలంగాణ ప్రభుత్వాన్ని సంద్రించాలని రాష్ట్ర ప్రతినిధుల బృందం హాంగ్ టావోను కోరారు. ప్రస్తుతం జర్మనీలోని ఐదుచోట్ల తమకు యంత్ర పరికరాలు తయారీ యూనిట్లు ఉన్నాయని, వీటిలో 1200 మంది ఇంజనీర్లు, టెక్నీషియన్లు పనిచేస్తున్నారని తమ కంపెనీ తరుపున విదేశాల్లో సుమారు 300 మంది సాంకేతిక సేవలు అందిస్తున్నారని వివరించారు. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణలో ఇక్కడి ప్రభుత్వం భారీ ఎత్తిపోతల పథకాలను చేపట్టిందని, వీటికి భారీ విద్యుత్ యంత్ర పరికరాలు అవసరం అవుతాయని సంస్థ ప్రతినిధులకు పెంటారెడ్డి తెలిపారు. భారత్‌లో యూనిట్‌ను స్థాపించే ముందే ఇక్కడ ఒక సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ ఇన్ ఛీఫ్ అనిల్ వారికి సూచించారు. త్వరలో రాష్ట్రంలో పర్యటించి కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తామని ప్రతినిధుల బృందానికి హామీ ఇచ్చారు.

చిత్రం..షాంఘైలో సోమవారం
వీఈఎం సంస్థ ప్రతినిధులతో సమావేశమైన తెలంగాణ బృందం