బిజినెస్

స్వల్పంగా పెరిగిన సెన్సెక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: సోమవారంనాడు సాధారణ స్థాయిలో సాగిన లావాదేవీల్లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 35 పాయింట్లు పెరిగి 34,450.77 పాయింట్లకు చేరుకుంది. రియల్టీ, హెల్త్‌కేర్, వినియోగ వస్తువులు, ఐటీ రంగాల్లో జరిగిన నిలకడైన లావాదేవీల కారణంగా గత రెండు నెలల్లో ఎన్నడూ లేని రీతిలో సెన్సెక్స్ ఈ స్థాయికి చేరుకుంది. కొన్ని బ్లూచిప్ కంపెనీలు లాభాల బాట పట్టడం కూడా సెన్సెక్స్ పెరగడానికి బలంగా కారణమైందని విశ్లేషకులు తెలిపారు. అయితే ఆసియన్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు రావడం, ఐరోపా మార్కెట్లు కూడా మందకొడిగా సాగడంతోపాటు డాలర్ మారకంతో పోలిస్తే డాలర్ రూపాయి విలువ మరింత తగ్గడం మార్కెట్ ఒడిదుడుకులకు కారణమైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టాటా కన్సల్టెన్సీ చరిత్ర సృష్టించింది. వంద బిలియన్ డాలర్లకు చేరుకున్న విలువ కలిగిన కంపెనీగా ఒక దశలో నమోదైంది. అనంతరం స్వల్పంగా ఈ సంస్థ షేర్ విలువ తగ్గింది. అయినప్పటికీ వంద బిలియన్ డాలర్ల స్థాయికి టీసీఎస్ చేరుకోవడం ఓ అద్భుత విజయంగా భావిస్తున్నారు. కాగా వివిధ కంపెనీల షేర్లపై సాగిన కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్ ఒక దశలో 34,493 పాయింట్లకు చేరుకుంది. అంతిమంగా 35.19 పాయింట్లు పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 5 తర్వాత మార్కెట్ ఇంత భారీ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. టీసీఎస్ షేర్లపై భారీ కొనుగోళ్లు జరగడమే సెన్సెక్స్ పెరగడానికి దోహదం చేసిందని చెబుతున్నారు. కాగా, ఎన్‌ఎస్‌ఈ నిష్టీ 20.65 పాయింట్లు పెరిగి 10,514.95 పాయింట్ల వద్ద ముగిసింది. నికరంగా చూస్తే స్వదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దాదాపు 111.01కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అలాగే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు కూడా 21.02 కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లుగా తాత్కాలిక వివరాలను బట్టి తెలుస్తోంది.