బిజినెస్

ఎర్రచందనం విక్రయాల ద్వారా రూ.36కోట్లు ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 24: ఎర్రచందనం వేలం ద్వారా 36కోట్ల రూపాయల ఆదాయం లభించిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. 10వ విడత 1368 టన్నుల ఎర్ర చందనం తిరుపతిలో వేలం వేసేందుకు ప్రతిపాదించగా 685 టన్నులను వేలానికి సిద్ధం చేశామన్నారు. ఇందులో 94.2 టన్నుల ఎర్రచందనం అమ్ముడుపోయిందని తెలిపారు. నాలుగు లాట్ల ఏ గ్రేడ్ ఎర్రచందనం విక్రయం ద్వారా ఈ ఆదాయం సమకూరిందన్నారు. 10వ విడత ఎర్రచందనాన్ని మూడు దశల్లో విక్రయిస్తామని తెలిపారు. జూలై నెలలో జరిగే వనం-మనం కార్యక్రమానికి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. దాదాపు 20కోట్ల మొక్కలను ఈ కార్యక్రమం కింద నాటేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని మే 22న ఒంగోలులో నిర్వహించనున్నట్టు వెల్లడించారు.