బిజినెస్

నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 25: రెండు రోజుల పాటు బలపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలను చవిచూశాయి. ఓవైపు ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నిరుత్సాహకరమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో డెరివేటివ్‌ల కాలపరిమితి గురువారంతో ముగియనుండటంతో బుధవారం సెషన్ చివరలో మదుపరులు అమ్మకాలకు హడావుడి పడటంతో మార్కెట్ కీలక సూచీలు పడిపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 115 పాయింట్లకు పైగా పడిపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కీలకమయిన 10,600 పాయింట్ల స్థాయికి దిగువన ముగిసింది. అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగియడంతో దాని ప్రతికూల ప్రభావం వల్ల యూరోపియన్ స్టాక్ మార్కెట్లు దిగువ స్థాయిల వద్ద ప్రారంభం కాగా, ఆసియా మార్కెట్లు బలహీనపడ్డాయి. ఏప్రిల్ నెల డెరివేటివ్‌ల కాలపరిమితి గురువారంతో ముగియనుండటం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో అనిశ్చితికి కారణమయింది. బుధవారం దిగువ స్థాయి వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ సెషన్‌లో చాలా సమయం ప్రతికూల జోన్‌లోనే కొనసాగి ఒక దశలో 34,400.56 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 115.37 పాయింట్లు (0.33 శాతం) దిగజారి 34,501.27 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో ఈ సూచీ కొద్ది సేపు సానుకూల ధోరణిలోకి వెళ్లి 34,631.27 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. సెనె్సక్స్ క్రితం రెండు సెషన్లలో కలిపి 201.06 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ కూడా బుధవారం 43.80 పాయింట్లు (0.41 శాతం) పడిపోయి, 10,570.55 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఈ సూచీ 10,536.45- 10,612.60 పాయింట్ల మధ్య కదలాడింది. గత కొన్ని వారాలుగా విక్రయాలకు పాల్పడుతున్న ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) మంగళవారం నికరంగా రూ. 680.99 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. మరోవైపు, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 508.55 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.
సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో టాటా స్టీల్ అత్యధికంగా 2.01 శాతం నష్టపోయింది. ఐసీఐసీఐ బ్యాంక్ 1.86 శాతం నష్టంతో తరువాత స్థానంలో నిలిచింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో ఓఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, ఆసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, ఐటీసీ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, హీరో మోటోకార్ప్ ఉన్నాయి. మరోవైపు, భారతి ఎయిర్‌టెల్ షేర్ విలువ 3.37 శాతం పెరిగింది. లాభపడిన ఇతర సంస్థల్లో టీసీఎస్, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, యెస్ బ్యాంక్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, రిల్, హెచ్‌యూఎల్, విప్రో ఉన్నాయి.