బిజినెస్

హైదరాబాద్‌కు మరో ఆభరణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: హైదరాబాద్ సిగలోకి మరో ఆభరణం రానుంది. హైదరాబాద్ నగర శివార్లలో ఆభరణాల పరిశ్రమకు ఒక సెజ్‌ను, అలాగే బంగారం శుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఆభరణాల పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. వీరికి సెజ్ ఏర్పాటు చేసే విషయమై రాష్ట్ర పరిశ్రమల శాఖ కేంద్ర అనుమతులకు ప్రతిపాదనలు పంపింది. బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఆభరణాల పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికను ఖరారు చేసింది. ఆఫ్రికానుంచి శుద్ధి చేయని బంగారాన్ని దిగుమతి చేసుకుని ఇక్కడ శుద్ధి చేసేందుకు వీలుగా ఒక పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు బంగారం శుద్ధిలో నైపుణ్యం ఉన్న సంస్థ ఇప్పటికే ప్రభుత్వ అధికారులను సంప్రదించింది. నగర శివార్లలోని కొంగరకొలాన్‌లో బంగారం శుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేయవచ్చని సమాచారం. మరో పరిశ్రమ కూడా బంగారం శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ పరిశ్రమల నుంచి నిర్దిష్టమైన ప్రతిపాదనలు త్వరలో ప్రభుత్వానికి అందనున్నాయి. అలాగే ముత్యాలు, ఆభరణాల తయారీకి సంబంధించి పది యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముం దుకు వచ్చారు. ప్రభుత్వం గుర్తించిన అత్యంత ప్రాధాన్యత ఉన్న పరిశ్రమలో ఆభరణాల పరిశ్రమ ఒకటి. ఆభరణాల పరిశ్రమను 25 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. దీనికి సెజ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కేంద్ర అనుమతులు కావాలని పరిశ్రమల వర్గాలు తెలిపాయి. పారిశ్రామికవేత్తలు ప్రాజెక్టు రిపోర్టులు ఇవ్వాలని పరిశ్రమల శాఖ కోరింది. వచ్చే జూన్ నెలలో ఢిల్లీలో బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్‌లో ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందనున్నాయి. బంగారం శుద్ధికి సంబంధించి దేశంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీపూర్ జిల్లా నాదన్‌లో ఒక పరిశ్రమ ఉంది.
హైదరాబాద్‌లో ప్రతిపాదించిన బంగారం శుద్ది పరిశ్రమ ద్వారా సాలీనా 30 టన్నుల బంగారం, 100 టన్నుల వెండిని ఉత్పత్తి చేస్తారు. దీనికి దాదాపు రూ. 550 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ అవసరం. ఈ పరిశ్రమను దశలవారీగా విస్తరించనున్నారు. ఆభరణాల పరిశ్రమ, బంగారం శుద్ధి ప్లాంట్ల వల్ల తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిరేటు, జిఎస్‌డిపి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి.