బిజినెస్

2017-18లో మహేష్ బ్యాంక్ టర్నోవర్ రూ. 3500 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్తాన్‌లో 45 బ్రాంచిలతో విస్తరించి ఉన్న మహేష్ అర్బన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.3500 కోట్ల టర్నోవర్‌తో రికార్డు సృష్టించినట్లు ఆ బ్యాంకు చైర్మన్ పురుషోత్తం దాస్ మందానా ప్రకటించారు. గురువారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకు పన్నులు చెల్లించకముందు 2018 మార్చి 31వ తేదీ వరకు రూ.42.85 కోట్ల లాభాలను సాధించిందని చెప్పారు. అంతకు ముందు ఏడాది కంటే లాభాల్లో 39.90 శాతం వృద్ధిరేటు సాధించినట్లు చెప్పారు. తమ బ్యాంకు డిపాజిట్లు రూ.2308 కోట్లకు చేరుకున్నాయన్నారు. అడ్వాన్సులు రూ.1255 కోట్లు చెల్లించామన్నారు. బ్యాంకు మొత్తం వాణిజ్య లావాదేవీల్లో వృద్ధిరేటు 7.02 శాతం నమోదైందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ ఉమేష్ చంద్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో తమ బ్యాంకు రూ. 4200 కోట్ల బిజినెస్ సాధించాలని లక్ష్యం గా పెట్టుకున్నామన్నారు. బంజారాహిల్స్‌లో రూ.45 కోట్లతో అత్యంత ఆధునిక భవన సముదాయాన్ని బ్యాంకు కోసం నిర్మించామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలి సహకార అర్బన్ బ్యాంకుగా తమ బ్యాంకుకు మంచి పేరు సాధించినట్లు చెప్పారు. 12 ఎటిఎంలు ఉన్నాయని చెప్పారు. ఆధునిక బ్యాంకు లావాదేవీలను తమ బ్యాంకు ద్వారా నిర్వహించవచ్చన్నారు. టోల్ ఫ్రీ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నామన్నారు.