బిజినెస్

ఓరియంట్‌లో స్ట్రాంగ్ క్రీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాసిపేట: ఆసిఫాబాద్ జిల్లా కుమ్రం భీం జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారంలో మరో నూతన బ్రాండ్‌ను అధికారులు ఆవిష్కరించారు. దేవాపూర్ ప్లాంట్‌లో ఇప్పటి వరకు బిర్లా ఎ1 బ్రాండ్‌ను ఉత్పత్తి చేసిన ఓరియంట్ యాజమాన్యం నూతనంగా స్ట్రాంగ్ క్రీట్‌ను మొదటిసారిగా శుక్రవారం లాంచింగ్ చేసారు. ఈ సందర్భంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌విఆర్ మూర్తి, జనరల్ మేనేజర్ శ్రీనివాస రెడ్డి, జనరల్ మేనేజర్ హెచ్‌ఆర్ ఆలోక్ గుప్తాలు పూజా కార్యక్రమాలను నిర్వహించా రు. అనంతరం మొదటి లోడ్ (ట్రిప్) ను తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఇప్పటివరకు బిర్లా ఎ1 మంచి పేరు సంపాదించందని, అదే విధంగా నూతనంగా లాంచింగ్ చేసిన స్ట్రాంగ్ క్రీట్ కూడ మంచి పేరు తెస్తుందనే ఆశాభావాన్ని మూర్తి వ్యక్తం చేసారు. ఈ సిమెంట్ ఎంతో నాణ్యమైనదని మన్నిక ఉంటుందని తెలిపారు. కంపెనీ అధికారులతో పాటు కార్మికులు పాల్గొన్నారు.