బిజినెస్

46 వేసవి ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే మరో46 ప్రత్యేక రైళ్లను శనివారం ప్రకటించింది. విశాఖపట్నం-సికింద్రాబాద్, విశాఖపట్నం-తిరుపతి మధ్య 20 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించగా, నాందేడ్- పనె్వల్ మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. జూలై 3, 10, 17, 24, 31 తేదీల్లో విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైలు బయలు దేరుతుండగా, తిరుగుప్రయాణంలో జూలై 4, 11, 18, 25, ఆగస్టు 1 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. అలాగే విశాఖపట్నం-తిరుపతి మధ్య జూలై 9, 16, 23, 30 తేదీల్లో నడుపుతుండగా, తిరుగు ప్రయాణంలో జూలై 2, 9, 16, 23, 30 తేదీల్లో నడుపుతుండగా, తిరుగు ప్రయాణంలో జూలై 3, 10, 17, 24, 31 తేదీల్లో తిరుపతి నుంచి నడుపుతున్నట్లు రైల్వే తెలిపింది. కాగా, నాందేడ్-పనే్వల్ మధ్య మే 5, 12, 19, 26, జూన్ 2, 9, 16, 23, 30, జూలై 7, 14, 21, 28 తేదీల్లో నడుపుతున్నట్లు పేర్కొంది. తిరుగు ప్రయాణంలో పనే్వల్ నుంచి మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24, జూలై 1, 8, 15, 22, 29 తేదీల్లో నడుపుతున్నట్లు తెలిపింది. దక్షిణ రైల్వేలోని అరక్కోణం స్టేషన్ వద్ద సిగ్నలింగ్ పనుల కారణంగా మే నెల 2, 6 తేదీల్లో మూరే మార్కెట-తిరుపతి-మూరే మార్కెట్ మధ్య తిరిగే ప్యాసింజర్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. తిరువనంతపురం-గోరఖ్‌పూర్ రాప్టిసాగర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 29న ఉదయం 6.15 గంటలకు బయలు దేరాల్సి ఉండగా అదే రోజు రాత్రి 8 గంటలకు బయలుదేరుతుందని ద.మ.రైల్వే ప్రకటించింది.