బిజినెస్

అయిదోవారమూ బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా అయిదో వారం బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఈ వారం 554.12 పాయింట్లు పుంజుకొని 34,969.70 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ మదుపరులకు మానసికంగా కీలకమయిన 10,700 పాయింట్ల స్థాయికి చేరువలో 10,692.30 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, మొత్తం మీద బుల్స్ ఆధిక్యమే కొనసాగింది. ఏప్రిల్ నెల ఎఫ్‌అండ్‌ఓ గడువు ముగియడం, అనిశ్చితిలో ఉన్న రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే తాజాగా 13 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, లోహాల ధరలు పెరగడం వంటివి దేశీయ స్టాక్ మార్కెట్ ఎదుగుదలను కొంత వరకు నిరోధించాయి. అయితే, అంతా ఊహించినట్లుగా నాలుగో త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు ప్రోత్సాహకరంగా ఉండటం ప్రధానంగా దేశీయ స్టాక్ మార్కెట్లు బలపడటానికి దోహదపడింది. దీంతో పాటు ఈ సంవత్సరం రుతుపవనాలు బాగుంటాయని, సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు, దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయన్న స్థూలార్థిక గణాంకాలు మార్కెట్ కీలక సూచీలు పుంజుకోవడానికి తోడ్పడ్డాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ తిరిగి కీలకమయిన 35,000 పాయింట్ల స్థాయికి సమీపంలోకి చేరుకుంది.
ఈ వారంలో కీలకమయిన ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లలో వచ్చిన పటిష్ఠమయిన ర్యాలీ పదేళ్ల తరువాత మరో భారతీయ కంపెనీ 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ గల కంపెనీగా అవతరించడానికి దోహదపడింది. ప్రైవేటురంగ బ్యాంకు యెస్ బ్యాంక్ నాలుగో త్రైమాసికంలో గొప్పగా ఆర్జించిన నికర లాభం మదుపరులకు మళ్లీ బ్యాంకులు, ఆర్థిక సంస్థల పట్ల విశ్వాసం పెరగడానికి దోహదపడింది. నాలుగో త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న తరుణంలో రిలయన్స్ షేర్లలో కొనుగోళ్లు పుంజుకోవడం కూడా కీలక సూచీలు పెరగడానికి దోహదపడింది.
సెనె్సక్స్ ఈ వారంలో 33,493.69 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, 35,065.81 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 34,259.27 పాయింట్ల కనిష్ట స్థాయి మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 554.12 పాయింట్లు (1.61 శాతం) పుంజుకొని, 34,969. 70 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం నాలుగు వారాలలో కలిసి 1,819.04 పాయింట్లు (5.58 శాతం) పెరిగింది. నిఫ్టీ కూడా ఈ వారంలో 10,592.80 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, 10,719. 80- 10,514.95 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారంతో పోలిస్తే 128.25 పాయింట్లు (1.21 శాతం) పుంజుకొని, 10,692.30 పాయింట్ల వద్ద ముగిసింది.
బ్యాంకులు, చమురు- సహజ వాయువు, స్థిరాస్తి, ఆరోగ్య సంరక్షణ, వాహన, ఐపీఓలు, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాల షేర్ల నేతృత్వంలో ఈ వారంలో కొనుగోళ్లు జరిగాయి. మరోవైపు, లోహ, కన్స్యూమర్ డ్యూరేబుల్స్, పవర్, పీఎస్‌యూ, టెక్నాలజి షేర్ల ధరలు మదుపరుల లాభాల స్వీకరణతో తగ్గిపోయాయి. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇనె్వస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఈ వారంలో రూ. 2,006.21 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. ఈ వారంలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 118.24 పాయింట్లు (0.70 శాతం) పుంజుకొని 16,917. 18 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 61.93 పాయింట్లు (0.34 శాతం) పెరిగి 18,239.96 పాయింట్ల వద్ద స్థిరపడింది.