బిజినెస్

చైనా కాన్సులేట్ జనరల్ మా ఝాన్‌వూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 28: భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)తోనే రెండు దేశాల మధ్య మరింతగా వాణిజ్య విస్తరణ జరుగుతుందని చైనా పేర్కొంది. ‘వర్తకం మరియు పెట్టుబడుల విషయంలో రెండు దేశాల్లో కొన్ని అడ్డంకులు ఉన్నాయని నేను వింటున్నా. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరినట్లయితే రెండు దేశాల మధ్య వాణిజ్యపరంగా పరస్పర మార్పిడులకు అవకాశం ఏర్పడుతుంది’ అని కోల్‌కతాలోని చైనా కాన్సులేట్ జనరల్ మా ఝాన్‌వూ అన్నారు. భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన పరస్పర సంప్రదింపుల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. ప్రపంచ దేశాలకు చైనా ఆర్థిక వ్యవస్థను మరింత అందుబాటులోకి తీసుకొస్తామని 2017, అక్టోబర్‌లో జరిగిన 19వ కాంగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ప్రకటించిందన్న అంశాన్ని ఆయన గుర్తు చేశారు. ‘మేం భారత్‌నుంచి మరిన్ని దిగుమతులు కోరుకుంటున్నాం. ముఖ్యంగా తూర్పు రాష్ట్రాలనుంచి..’ అని ఆయన స్పష్టం చేశారు. విద్యారంగంలో కూడా రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవచ్చునన్నారు. ‘చాలా చైనా యూనివర్సిటీలు, భారతీయ విశ్వవిద్యాలయాలతో టై-అప్ అయ్యాయి. మొట్టమొదటి సారి మే నెలలో ఎక్స్‌పో ఆఫ్ చైనీస్ యూనివర్సిటీస్’ జరుగనున్నదని ఆయన వెల్లడించారు.

.