బిజినెస్

వేతనం ఎక్కువిస్తే మారడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 83శాతం మంది భారతీయ ఉద్యోగుల ధోరణి పఇండీడ్ జాబ్ సైట్ సర్వేలో వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 28: భారతదేశంలో పరిశ్రమల రంగంలో పనిచేసే ఉద్యోగుల్లో 83 శాతం మంది వేతనాలు ఎక్కువ ఇచ్చే కంపెనీకి మారేందుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రముఖ జాబ్ సైట్ ఇండీడ్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇందులో 25-34 సంవత్సరాల మధ్య ఉద్యోగులు ఉన్నారని ఇండీడ్ సంస్థ పేర్కొంది. పురుషులతో పోల్చితే మహిళా ఉద్యోగులు వేతనం ఎక్కువ ఇవ్వాలని అడిగే యోచనతో ఉంటారు. 64 శాతం మంది పురుష ఉద్యోగులు వేతనం పెంచాలని 67 శాతం మంది మహిళా ఉద్యోగులు వేతనాలు పెంచాలని కోరుకుంటారు. 20 శాతం మంది మహిళలు పురుషులకు తమ కంటే ఎక్కువ వేతనాలు ఇస్తున్నారని భావిస్తున్నారు. 64 శాతం మంది ఉద్యోగులు ఇతర దేశాల్లో కంటే భారత్‌లో వేతనాలు తక్కువని భావిస్తారు. తమకు పనిచేసే చోట ఎక్కువ ప్రయోజనాలు కావాలని ఉద్యోగులు కోరుకుంటారు. 60 శాతం మంది ఉద్యోగులు పనివేళల్లో మార్పులు ఉండాలని కోరుకుంటారు. వార్షికంగా 47 శాతం మంది సాలీనా ఇచ్చే సెలవుల సంఖ్యను పెంచాలని కోరుకుంటున్నారు. 63 శాతం మంది వేతనాలు పెంచే బదులు హెల్త్‌కేర్ బెనిఫిట్లు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఇండీడ్ సర్వేలో వెల్లడైంది. ఉద్యోగుల్లో వేతనాలు పెరగాలని, ఇంకా బాగుండాలని కోరుకుంటారని ఇండీడ్ ఎండి శశికుమార్ తెలిపారు.