బిజినెస్

రూ. 15,500 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఈ నెలలో ఇప్పటి వరకు విదేశీ మదుపర్లు భారత మూలధన మార్కెట్ నుంచి రూ.15,500 కోట్ల మేర తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. రూపాయి బలహీన పడటం, అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, యుఎస్-చైనాల మధ్య వాణి జ్య సంబంధాలు అస్థిరతకు లోనుకావడం ఇందుకు ప్రధాన కారణం. గత నెలలో రూ.11,654 కోట్ల మేర ఇన్‌ఫ్లో ఉండగా, రుణ మార్కెట్ నుంచి రూ.9,000 కోట్లు ఔట్‌ఫ్లో నమోదైంది. అంతకుముందు విదేశీ పోర్ట్‌పోలియో మదుపర్లు(ఎఫ్‌పిఐ) రూ.11,674 కోట్లను దేశీయ మార్కెట్లనుంచి ఉపసంహరించారు. ఇప్పటి వరకు అందిన తాజా సమాచారం ప్రకారం ఎప్రిల్ నెలలో ఎఫ్‌పిఐలు రూ.5,552 కోట్ల మేర ఈక్విటీ మొత్తాన్ని, రూ..10,036 కోట్ల మేర రుణ మార్కెట్‌నుంచి ఉపసంహరించుకున్నారు. దేశీయ రాజకీయ పరిస్థితులు, అత్యధిక వ్యాల్యుయేషన్లు, ఈక్విటీలపై దీర్ఘకాలిక కేపిటల్ గెయిన్స్ టాక్స్ వంటివి భారత్‌లో అవకాశాలను మరింత దెబ్బతీశాయని మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ వెల్త్ లిమిటెడ్‌కు చెందిన అశీష్ శంకర్ పేర్కొన్నారు.
కాగా ఇప్పటి వరకు ఈ ఏడాది ఎఫ్‌పీఐలు రూ.8,460 కోట్లు ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టగా, రూ.10,810 కోట్లు రుణ మార్కెట్ల నుంచి ఉపసంహరించారు.