బిజినెస్

రూ. 69,918 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: పది అత్యంత విలువయిన భారతీయ కంపెనీలలోని ఏడు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (ఎం-క్యాప్) ఈ వారంలో రూ. 69,917.79 కోట్లు పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) అత్యధికంగా లబ్ధి పొందింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), రిల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, కోటక్ మహింద్రా బ్యాంక్ మార్కెట్ విలువ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో పెరిగాయి. కాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా, ఓఎన్‌జీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయింది. ఈ వారంలో లాభపడిన సంస్థల్లో రిల్ మార్కెట్ విలువ రూ. 42,255.18 కోట్లు పెరిగి, రూ. 6,30,185.08 కోట్లకు చేరింది. టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 9,265.16 కోట్లు పెరిగి, రూ. 6,61,348.08 కోట్లకు చేరింది. కోటక్ మహింద్రా బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,513.29 కోట్లు పెరిగి, రూ. 2,26,510.88 కోట్లకు చేరింది.
ఐటీ దిగ్గజం టీసీఎస్ గురువారం మార్కెట్ ముగిసే సమయానికి వంద బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన తొలి భారతీయ కంపెనీగా అవతరించింది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ విలువ రూ. 4,390.79 కోట్లు పెరిగి, రూ. 3,11,352.38 కోట్లకు చేరింది. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,027.42 కోట్లు పుంజుకొని, రూ. 3,40,804. 94 కోట్లకు పెరిగింది. హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) మార్కెట్ విలు వ రూ. 1,958.9 కోట్లు పెరిగి, రూ. 3,19,170. 59 కోట్లకు చేరింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1,507.05 కోట్లు పెరిగి, రూ. 2,58,851.82 కోట్లకు చేరింది. మరోవైపు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 9,887.3 కోట్లు పడిపోయి, రూ. 4,98, 996.93 కోట్లకు చేరింది. మారుతి సుజుకి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 7,831.42 కోట్లు దిగజారి, రూ. 2,65,164.37 కోట్లకు పడిపోయింది. ఓఎన్‌జీసీ ఎం-క్యాప్ రూ. 2,053.31 కోట్లు తగ్గి, రూ. 2,31,960.73 కోట్లకు చేరింది. టాప్-10 సంస్థల ర్యాంకింగ్‌లో టీసీఎస్ అగ్రస్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో వరుసగా రిల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతి, ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ, కోటక్ మహింద్రా బ్యాంక్ ఉన్నాయి.