బిజినెస్

7.5 శాతం ఉండొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: భారత ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ ప్రగతి 7.5 శాతంగా నమోదయ్యే అవకాశమున్నదని డచ్ బ్యాంకు అంచనా వేసింది. ‘2018-19 ఆర్థిక సంవత్సరానికి దేశ ఆర్థిక ప్రగతి 7.5 శాతం ఉండబోతున్నదని మా అంచనా (ఆర్‌బీఐ అంచనా 7.4%) 2017-18లో నమోదైన 6.7 శాతం నుంచి ఈ స్థాయికి ఆర్థిక ప్రగతి చేరుకుంటుంది’ అని బ్యాంకు పేర్కొంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల, ఆర్‌బీఐ రేట్లు పెంచే అవకాశాలు, బ్యాంకుల్లో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలు వంటివి ప్రగతిని దెబ్బతీయవచ్చు. అయితే ‘సామర్థ్య వినియోగం మెరుగుపడటం ప్రైవేటు రంగానికి ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. వౌలిక వసతుల కల్పనపైనే ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇవన్నీ ప్రగతికి ప్రోత్సాహకాలుగా ఉంటాయి’ అని నివేదిక స్పష్టం చేసింది.