బిజినెస్

నీతీ ఆయోగ్ కొత్త అజెండా ‘న్యూ ఇండియా-2022’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: నీతీ ఆయోగ్ కొత్త అభివృద్ధి అజెండాతో ముందుకు రానున్నది. ‘న్యూ ఇండియా- 2022’ పేరుతో ప్రవేశపెట్టనున్న ఈ అజెండాతో ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు అవసరమైన వ్యూహాలను నీతీ ఆయోగ్ ఇందులో వెల్లడించనున్నది. నీతీ ఆయోగ్ వైస్-్ఛర్మన్ రాజీవ్ కుమార్ సోమవారం మాట్లాడుతూ, ‘న్యూ ఇండియా-2022’ అభివృద్ధి అజెండాకు తుదిరూపం ఇచ్చిన తరువాత మొత్తం 15 సంవత్సరాలకు అవసరమైన విజన్ డాక్యుమెంట్‌పై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ఈ వ్యూహాత్మక ముసాయిదా తుది దశలో ఉంది. బహుశా దీనికి ‘డెవలప్‌మెంట్ అజెండా డాక్యుమెంట్ ఫర్ న్యూ ఇండియా 2022’ అని పేరు పెట్టే అవకాశముంది.
అంతకు ముందు నీతీ ఆయోగ్ మొత్తం మూడు ముసాయిదాలతో ముందుకు రావాలనుకున్నది. అవి వరుసగా, మూడేళ్ల కార్యాచరణ అజెండా, ఏడు సంవత్సరాల మధ్యకాలిక వ్యూహానికి సంబంధించిన ముసాయిదా, పదిహేనేళ్ల విజన్ డాక్యుమెంట్. మొత్తం ఆరు సమస్యలకు పరిష్కారం లభించాలని గత ఏడాది మేధావి వర్గం కోరింది. అవి..పేదరికం, మురికి, అవినీతి, ఉగ్రవాదం, కులతత్వం, మతతత్వం. ఈ సమస్యలకు పరిష్కారాన్ని కనుకొనేందుకు అవసరమైన భూమికను 2022 నాటికి రూపొందించాలన్నది లక్ష్యం. అప్పటికి భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు ముగుస్తాయి. ఇదిలావుండగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ అవకాశాలను పరిశీలించాల్సిందిగా మేధావులను ప్రధానమంత్రి కార్యాలయం కోరింది.
అయితే ఇప్పటికే 40 ప్రభుత్వ రంగ సంస్థలనుంచి పెట్టుబడులను ఉపసంహరించాలని నీతీ ఆయోగ్ సిఫారసు చేసింది.
ఈ ఆర్థిక సంవత్సంలో కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలనుంచి రూ.80 వేలకోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించే అవకాశముంది. ఇటీవల బ్యాంకుల్లో చోటు చేసుకుంటున్న కుంభకోణాలు ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.13,000 కోట్ల కుంభకోణం అంశాలపై రాజీవ్ కుమార్ మాట్లాడుతూ,ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్పొరేట్ పాలనను మరింత మెరుగు పరచేందుకు పి.జె. నాయక్ కమిటీ కొన్ని సిఫారసులు చేసిందన్నారు. వీటిని తప్పనిసరిగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నదన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలుగుతుందని కుమార్ అభిప్రాయపడ్డారు.