బిజినెస్

పెట్రో ధరల సమీక్షకు స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, మే 1: మరో రెండు వారాల్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించే ప్రక్రియకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఫుల్‌స్టాప్ పెట్టాయి. అంతర్జాతీయంగా బారెల్ పెట్రోల్ ధర రెండు డాలర్లు పెరిగినా పెట్రో ధరల పెంపుదల జోలికి చమురు సంస్థలు వెళ్లే సాహసం చేయడం లేదు. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే సామాన్య ప్రజలపై పెట్రో ధరల భారం పడదు. కాని ఈ ప్రతిపాదనను ఆమోదించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. 55 నెలల గరిష్ట స్థాయిలో లీటర్ పెట్రోలు ధర రూ.74.63, డీజిల్ ధర రూ. 65.93కు చేరుకుంది. గత నెల 24వ తేదీ నుంచి చమురు రంగ సంస్థలు పెట్రో ధరలను సమీక్షించడం మానివేశాయి. ఏప్రిల్ 24వ తేదీ నుంచి పెట్రో, డీజిల్ ధరలు నిలకడగా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలను విశే్లషిస్తే పెట్రోలు ధర రూ. 74.63 నుంచి రూ.80.56కు, అదే స్థాయిలో డీజిల్ ధర లీటర్‌కు రూ. 74.63కు పెరిగాలి. అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ రూ.65.41 నుంచి రూ. 66.14కు తగ్గింది. దీని వల్ల దిగుమతుల విలువ పెరిగింది. ధరల గురించి చర్చించమని చమురు మంత్రిత్వ శాఖల అధికారి ఒకరు చెప్పారు. ధరల సమీక్ష అనేది చమురు సంస్థలు తీసుకునే నిర్ణయమన్నారు. కర్నాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చమురు ధరలను పెంచవద్దని ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఈ విషయమై జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని చమురు శాఖ బంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇటీవల తెలిపారు. గత ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా చమురు సంస్థలు రోజుకు ఒకటి నుంచి మూడు పైసల వరకు పెట్రో ధరలను తగ్గించాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ధరలు మళ్లీ పెరిగాయి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నవంబర్ నుంచి 2016 జనవరి వరకు 9 సార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఆ తర్వాత గత ఏడాది అక్టోబర్‌లో ఒకసారి పెట్రోల్ లీటర్‌పై రూ.2 పన్నును కేంద్రం తగ్గించింది. 2014-15లో ఎక్సైజ్ డ్యూటీ వల్ల రూ.99వేల కోట్ల ఆదాయం రాగా, 2016-17లో ఈ ఆదాయం రూ.2.42 లక్షల కోట్లకు పెరిగింది.