బిజినెస్

రికార్డు స్థాయికి జీఎస్‌టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఏప్రిల్‌లో రూ. లక్ష కోట్లకు పైగా వసూలు
న్యూఢిల్లీ, మే 1: ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వ సూళ్లు రికార్డు స్థా యిలో అంటే రూ. 1,03,458 కోట్ల కు చేరుకున్నట్లు మంగళవా రం విడుదల చేసిన అధికారిక ప్రకటన వెల్లడించింది. కాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచా రం ప్రకారం, 2017, ఆగస్టు నుంచి 2018 మార్చి నెలాఖరు వరకు నెలసరి సగటు వ స్తుసేవల పన్నుల వసూళ్లు రూ. 89,885 కోట్లు. 2018, ఏప్రిల్ నెలలో విడుదల చేసి న సగటు జీఎస్‌టీ రూ. 103,458 కోట్లు కాగా, ఇందులో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (సీజీఎస్‌టీ) రూ.18,652 కోట్లు, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (ఎస్‌జీఎస్‌టీ) రూ.25,704 కోట్లు, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (ఐజీఎస్‌టీ0 రూ.50,548 కోట్లు(దిగుమతులపై వసూలు చేసిన రూ.21,246 కోట్లు కలిపి), సెస్ రూ.8,554 కోట్లు (దిగుమతులపై వసూలు చేసిన రూ.702 కోట్లు కలిపి)గా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 30 వరకు, మార్చి నెలకు సమర్పించిన మొత్తం జీఎస్‌టీఆర్ 3బి రిటర్న్‌లు 60.47 లక్షలు. కాగా మార్చి నెలకు రిటర్న్‌లు దాఖలు చేయడానికి అర్హులైనవారి సంఖ్య 87.12 లక్షలు. అంటే 69.5 శాతం మంది రిటర్న్‌లు దాఖలు చేశారు.
పన్నుల వసూళ్లు ఊపందుకోవడం, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని సూచిస్తున్నదని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు కనుక గత బకాయిలను కూడా ఇప్పుడు చెల్లించడం జీఎస్టీ మొత్తం పెరగడానికి కారణం కావచ్చని కూడా ప్రకటన పేర్కొంది. అందువల్ల ఈ ఆదాయాన్ని భవిష్యత్‌కు పోకడకు సూచనగా భావించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కాగా రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు జరగడంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పన్ను చెల్లింపుదార్లను, జీఎస్టీ కౌన్సిల్‌ను, రాష్ట్ర, కేంద్ర పాలక వర్గాలను అభినందించారు.