బిజినెస్

‘రెగ్జిట్’ ప్రభావం మార్కెట్లపై పడలేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ నిష్క్రమణ నిర్ణయం.. దేశీయ స్టాక్ మార్కెట్లపై నిజంగా ప్రభావం చూపలేదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సోమవారం మార్కెట్లు లాభాల్లో ముగిసిన నేపథ్యంలో చిన్నచిన్న అంశాలకు ప్రభావితమయ్యే మదుపరులు.. రాజన్ నిష్క్రమణను తేలిగ్గా తీసుకున్నారనే అంతా అనుకున్నారు మరి. కానీ ఇలా అనుకోవడానికి వెనుక కేంద్ర ప్రభుత్వ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) నిర్ణయంతోపాటు ప్రభుత్వరంగ బీమా దిగ్గజ సంస్థ ఎల్‌ఐసితోపాటు మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఉన్నాయి. రాజన్ నిష్క్రమణ (రెగ్జిట్) భయంతో విదేశీ మదుపరులు సోమవారం ఒక్కరోజే 3,700 కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు మరి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో కేవలం ఒక్కరోజులో ఈ స్థాయిలో విదేశీ మదుపరులు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ఇదే ప్రథమం. సాధారణంగా అయితే ఈ పరిణామంతో దేశీయ మదుపరులు కూడా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యేవారు. దీంతో సూచీలు భారీ నష్టాలకు లోనయ్యేవి. కాని ఎల్‌ఐసి.. వివిధ ప్రధాన సంస్థల్లో 99 కోట్ల రూపాయలతో షేర్లను కొనుగోలు చేసింది. అలాగే మ్యూచువల్ ఫండ్ సంస్థలు 459 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి. ఇదే సమయంలో మరో 1,215 కోట్ల రూపాయల విలువైన రుణ సెక్యురిటీలనూ కొన్నాయి. అన్నింటికి మించి కీలక రంగాల్లో ఎఫ్‌డిఐని సంచలనాత్మకంగా అనుమతించి మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత పెంచింది మోదీ సర్కారు. దీంతో రెగ్జిట్ భయాలతో విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణే కాదు.. బ్రెగ్జిట్ భయాలు కూడా తొలగిపోయాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 241, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 68 పాయింట్లు పెరిగినది తెలిసిందే. ఈ సెప్టెంబర్ 4తో రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగుస్తుండగా, వివాదాస్పద పరిణామాల మధ్య మరోసారి ఈ బాధ్యతలను చేపట్టలేనని శనివారం ప్రకటించినది తెలిసిందే. దీంతో సోమవారం మార్కెట్లపై ఇది ప్రతికూల ప్రభావం చూపవచ్చని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమైనదీ విదితమే.